Site icon HashtagU Telugu

‎Flowers Plants: ఈ పూల మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు.. కనక వర్షం కురవాల్సిందే!

Flowers Plants

Flowers Plants

‎Flowers Plants: ఇప్పుడు చెప్పబోయే పూల మొక్కలను ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవాలని వాటి వల్ల అనేక మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి ముఖ్యంగా లక్ష్మీ అనుగ్రహం కలిగి కాసుల వర్షం కురవడం ఖాయం అని చెబుతున్నారు. మరి ఇంతకీ వాస్తు ప్రకారం ఇంటి వద్ద ఎలాంటి మొక్కలను పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‎వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో మోదుగ చెట్టు కూడా ఒకటి. మోదుగ చెట్టు ఇంటి దగ్గర ఉంటే ఇంట్లో అంతా మంచే జరుగుతుందట. ఈ మోదుగ పువ్వులను ఇంట్లో డబ్బులు పెట్టే చోట పెడితే లక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం అని చెబుతున్నారు. డబ్బుకు కూడా ఎలాంటి లోటు ఉండదట. శంఖు పుష్పం మొక్క కూడా ఇంట్లో ఆనందాన్ని శ్రేయస్సును పెంచుతుందని చెబుతున్నారు. ఈ మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందట.

‎దుర్గాదేవి అనుగ్రహం కోసం ఇంట్లో గులాబీ మొక్కలను పెంచుకోవడం మంచిదని చెబుతున్నారు. గులాబీ పువ్వులతో దుర్గాదేవిని పూజిస్తే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదట. అదేవిధంగా వాస్తు శాస్త్రంలో మందారం చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. మందార పువ్వును ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందట. అలాగే ఇంట్లో ఉండవలసిన మొక్కలలో పారిజాతం మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదంగా భావించాలట. దీనివల్ల మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందట. అదేవిధంగా ఇంట్లో మల్లె మొక్కను నాటడం వల్ల ఆనందం శ్రేయస్సు కలుగుతుందట. వాస్తు ప్రకారం ఇంట్లో పియోని మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోయి ఆ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందట. సంపద కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

Exit mobile version