Vasthu Tips: ఈ మొక్కని మీ ఇంట్లో ఉత్తర దిశలో పెడితే చాలు.. మార్పు మీరే గమనించవచ్చు?

మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా వాటిని ఏ దిశ

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 09:20 PM IST

మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాము. మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా వాటిని ఏ దిశలో ఉంచుకోవాలి అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వాస్తు శాస్త్రంలో చెట్లు, మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇంట్లో నాటిన చెట్లు, మొక్కలు పురోగతిని, సంతోషాన్ని, మనిషికి శ్రేయస్సును కలిగిస్తాయని నమ్ముతారు. ప్రతి ఇంట్లో ప్రతికూల శక్తులు ఉంటాయి. వాటిని తరిమివేయడానికి సరైన దిశలో, సరైన స్థలంలో మొక్కలు నాటడం అవసరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తులో తులసి మొక్క, దాని ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే.

అలాగే తులసి మొక్కే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు మరికొన్ని మొక్కలు ఉన్నాయని, అలాంటిదే వెదురు మొక్క అని తెలుపుతున్నారు. దీన్ని ఇంట్లో పెడితే నెగెటివ్ ఎనర్జీ ఉండదు. వెదురు మొక్కను నాటడం వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి ప్రతిరోజు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ దీన్ని నాటాలి. హాలు కానీ, డ్రాయింగ్ రూమ్ లోకానీ ఈ మొక్కను ఉంచవచ్చట. దీన్ని ఉత్తరంలో ఉంటే కలిసి వస్తుందట. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుంది. ఏవైనా అడ్డంకులు ఎదురైనప్పుడు వెదురు కాడను ఎర్రటి గుడ్డలో చుట్టి గాజు పాత్రలో ఉంచాలి. అయితే ఈ వెదురు కొమ్మ పొడిగా ఉండకూడదు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఆ ఇంట్లో వెదురు మొక్కను నాటాలి. దీనివల్ల ధన లాభం కలుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టిసారించేందుకు వెదురు మొక్కను పెంచుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. చదువుకునే పిల్లలు ఉన్న గదిలో 4 చిన్న మొక్కలు నాటితే వారి మనసు చదువుపైకి మళ్లుతుందని తెలిపారు. ప్రయోజనాలు పొందాలి అంటే దీన్ని సరైన దిశలోనే నాటాలి. సానుకూల శక్తిని పెంచుకోవడంతోపాటు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.