Site icon HashtagU Telugu

Night: పొరపాటున కూడా రాత్రిపూట ఈ పనులు అస్సలు చేయకండి?

Mixcollage 18 Mar 2024 08 03 Pm 3008

Mixcollage 18 Mar 2024 08 03 Pm 3008

హిందూ శాస్త్ర ప్రకారం రాత్రి సమయంలో పొద్దున సమయంలో మధ్యాహ్న సమయంలో కొన్ని రకాల పనులు చేయడం నిషిద్ధం. అలా రాత్రి సమయంలో కూడా తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. మరి రాత్రి సమయంలో ఇలాంటి తప్పులు చేయకూడదో ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది రాత్రిపూట ఊడ్చుతారు. కానీ ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు. శాస్త్రాల ప్రకారం, చీపురును లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే రాత్రిపూట ఊడ్చుస్తే మంచిది కాదట.

మంచం మీద ఆహారం తినడం చాలా మంది మంచం మీద ఆహారం తింటారు. కానీ ఇది మంచిది కాదు. మంచం మీద ఆహారం తినడం వాస్తు శాస్త్రంలో నిషిద్ధం. ఇది వాస్తు దోషాలను సృష్టిస్తుందట. ఇది కుటుంబం ఆనందం, శాంతిని ప్రభావితం చేస్తుందట. బట్టలు ఉతకడం కొంత మంది రాత్రి పూట బట్టలు ఉతకుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుందట.

ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ప్రబలుతాయట. అప్పు సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పు ఇవ్వొద్దు. సూర్యుడు అస్తమించిన తర్వాత అప్పు ఇవ్వకూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీపై అప్పుల భారం పెరగవచ్చు.