Vastu: మంచంపై కూర్చుని భోజనం చేసే అలవాటు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది భోజనం చేసేటప్పుడు ఎక్కువగా ఎత్తు ప్రదేశాలలో కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడుతున్నారు. హోటల్స్ లో అయితే టేబుల్స్

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 06:55 PM IST

ప్రస్తుత రోజుల్లో చాలా మంది భోజనం చేసేటప్పుడు ఎక్కువగా ఎత్తు ప్రదేశాలలో కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడుతున్నారు. హోటల్స్ లో అయితే టేబుల్స్ వైపు కూర్చుని తినడం అలవాటు. కానీ చాలామంది ఇంట్లో డైనింగ్ టేబుల్స్ లేదంటే కుర్చిలు లేదంటే సోఫా, మంచం పై కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే మంచంపై కూర్చుని భోజనం చేయడం. అలా మంచం పై కూర్చుని భోజనం చేయకూడదు. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచంపై కూర్చుని భోజనం చేస్తే తిన్న ఆహారం ఒంటికి పట్టదు.

మంచం కొళ్లకు పడుతుందని పెద్దలు అంటారు. కానీ వాస్తవానికి మంచంపై, సోఫాపై కూర్చుని భోజనం చేయడం రోగాలకు కోరి తెచ్చుకున్నట్టే అని చెప్పవచ్చు. అలా చేస్తే భార్య, భర్త మధ్య గొడవలు, కుటుంబంలో మనశ్సాంతి ఉండకపోవడంతో పాటూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. ఏ పని చేసినా విజయం దరిచేరదు. అందుకే భోజనం చేసేటపుడు భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే దేహమే దేవాయం, ఆత్మ భగవంతుడు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ దేహానికి శాంతి చేకూరాలంటే ఒక పద్దతిగా భోజనం చేయాలి.

అందుకే భోజనం చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ రాను రాను నేలపై కూర్చుని భోజనం చేయడమే మానేశారు. అందరూ కూడా డైనింగ్ టేబుల్ లకు అలవాటు పడిపోయారు. అలాగే ఉత్తరంవైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చెయ్యకూడదు.