Vasthu Tips: డబ్బు లోటు ఉండకూడదంటే ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉండాల్సిందే?

మామూలుగా హిందువులు ఇంట్లో ఎన్నో రకాల వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. అవి వాస్తు ప్రకారంగా ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇంట్లో కొన్ని రకా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 14 Feb 2024 08 16 Pm 6154

Mixcollage 14 Feb 2024 08 16 Pm 6154

మామూలుగా హిందువులు ఇంట్లో ఎన్నో రకాల వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. అవి వాస్తు ప్రకారంగా ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ప్రత్యేకంగా పెట్టుకోవాలని పండితులు కూడా చెబుతూ ఉంటారు. వాటి వల్ల వాస్తు ప్రకారంగా కలిసి రావడంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా డబ్బుకు లోటు ఉండకూడదు అంటే ఇంట్లో మూడు రకాల వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు పండితులు. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన వస్తువు గంట. ప్రతిరోజు ఇంట్లో గంట మోగాలి. ఈశాన్యంలో దేవుడి మందిరం దగ్గర గంట మోగించాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. అంతేకాదు గంటను మోగించడం వల్ల క్రిములు కూడా దూరమవుతాయి. ఇంట్లో ఉండాల్సిన రెండో వస్తువు శంఖం. శంఖం ఉన్న ఇళ్లల్లో వాస్తు దోషం తలెత్తదు. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. శంఖం విష్ణువు కాగా లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనది. శంఖం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. శంఖంని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని పూజించడం వల్ల మరిన్ని ఎక్కువ ఫలితాలు లభిస్తాయి.

గంట, శంఖంతోపాటు ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మరో వస్తువు వేణువు. వెదురు వేణువు ఇంట్లో ఉండటంవల్ల ఎల్లప్పుడూ ఆనందంతోపాటు శ్రేయస్సు ఉంటుందనే నమ్మకం ఉంది. అంతేకాదు.. ఇది ఇంట్లో ఉండటంవల్ల వ్యాపారంతోపాటు ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ప్రతిరోజు ఇంట్లో ఒక్కసారైనా గంట మోగడంతో పాటు శంఖం ఊదడం, వేణుగానం నుంచి వచ్చే శబ్ధం వినిపించడంవల్ల ఆ ఇంటికి సంబంధించి ఏమైనా వాస్తు దోషాలున్నా తొలిగిపోతాయి.

  Last Updated: 14 Feb 2024, 08:19 PM IST