Site icon HashtagU Telugu

Vastu Dosha: మీ ఇంట్లో వాస్తు దోషం ఉండకూడదంటే.. ఈ ఒక్క వస్తువు అక్కడ పెట్టుకోవాల్సిందే?

Mixcollage 13 Jun 2024 04 48 Pm 9258

Mixcollage 13 Jun 2024 04 48 Pm 9258

ఈ మధ్యకాలంలో వాస్తు విషయాలను పాటించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. స్థలం కొనుగోలు చేసినప్పటి నుంచి ఇల్లు కట్టడం ఇంట్లో వస్తువుల అమరికా వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు నియమాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇంట్లో ఉండే వస్తువులు సరైన దిశలో ఉండకపోతే నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులు కూడా ఇంట్లో ఉండే నెగటివిటీని తీసివేస్తాయి. అందుకే తప్పనిసరిగా ఇంట్లో ఉండే వస్తువులను వాస్తు ప్రకారం ఆ దిశలో ఉంచుకోవడం మంచిది.

ఇకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రధానమైన వస్తువు ఉప్పు. ఉప్పులేని వంటిల్లు ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరి వంటింట్లో ఈ ఉప్పు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉప్పును లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తారు. ఉప్పు లేకపోతే ఆ కూర కూడా రుచి ఉండదు. కాగా ఉప్పు ఇంట్లోనే నెగిటివీటిని తొలగిస్తుంది అన్న విషయం తెలిసిందే. అనేక రకాల వాస్తు దోషాలకు కూడా చెక్ పెడుతుంది. అలాగే ఇంట్లో కుటుంబంలో సఖ్యత నిలపడానికి కూడా ఉప్పును వినియోగిస్తారు. ఒకవేళ మీ ఇంట్లో బంధుమిత్రులతో ఎలాంటి గొడవలు అయి ఉంటే ఇంటి ప్రధాన ద్వారం కుడి లేదా ఎడమ సైడు ఒక బాల్ లో ఉప్పును పెట్టడం వల్ల కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది.

అలాగే మాములుగా దృష్టి దోషం తగిలితే మన పైనుంచి ఉప్పు తీసేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ విషయాన్ని చాలామంది పాటిస్తూనే ఉన్నారు. గుప్పెడు ఉప్పుతో మన చుట్టూ ఉప్పుతో తిప్పితే మనకు ఉండ నెగటివిటీ తొలగిపోతుంది. దృష్టి దోషం తగ్గిపోతుందని చాలామంది నమ్మకంతో పాటిస్తూ ఉంటారు. అంతేకాదు వాస్తు ప్రకారం మీ ఇంట్లో వాస్తు దోషం నెలకొని ఉంటే కూడా ఉప్పు మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఉత్తరం ఈశాన్య దిశలో వాష్రూమ్స్ ఉన్నప్పుడు అందులో ఒక బౌల్లో ఉప్పు పెడితే అది ఇంట్లో వాస్తు బ్యాలెన్స్ చేస్తుంది. వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అంతేకాదు ఉప్పుతో ఆరోగ్యం మీరు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేస్తే ఒంటినొప్పులు కూడా తగ్గిపోతాయి. ఎవరైనా డిప్రెషన్ సమస్యలతో బాధపడితే వారికి దగ్గరలుగా ఒక గాజు గ్లాసులో ఉప్పు వేసి పెట్టాలి. వెంటనే నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది.