Site icon HashtagU Telugu

Vasthu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఇలా చేస్తే చాలు.. జరగబోయే అద్భుతాన్ని అస్సలు నమ్మలేరు!

Vasthu Tips

Vasthu Tips

పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా పసుపును తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే స్త్రీలు కూడా పసుపును లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. పసుపు కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో లాభాలను కలిగి ఉంది. ఇంట్లో పసుపును సరైన విధంగా ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

కాగా పసుపును కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కూడా ఉపయోగిస్తారు. ఇది పరిశుభ్రతను, సానుకూల శక్తిని ప్రతిబింబిస్తుంది. అయితే ఈ పసుపును ఉపయోగించి కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల చాలా రకాల సమస్యలు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం ద్వారా శక్తి ప్రవేశిస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు. కాబట్టి అక్కడ పసుపును ఉపయోగిస్తే దోషాలు తొలగిపోతాయట. అలాగే మంచి శక్తులు ఆహ్వానించబడతాయని నమ్మకం.

ముఖ్యంగా ప్రధాన ద్వారానికి పసుపుతో కూడిన బట్టను వేలాడదీయడం వల్ల ఇంట్లో శుభ సమృద్ధి నెలకొంటుందట. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుందట. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు డబ్బు పెట్టే పెట్టే పెట్టెలో పసుపు ముద్దను ఉంచడం వల్ల ఆర్థిక లాభాలు మెరుగుపడతాయట. అలాగే డబ్బు నిల్వ ఉండడంతో పాటు అనవసరపు ఖర్చులు కూడా తగ్గిస్తుందట. పరసులో పసుపు ముద్దను ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుందట. సంపద కూడా నిలుస్తుంది అని చెబుతున్నారు. ఇంటి శుభ శాంతుల కోసం, ధనలాభం కోసం వాస్తు శాస్త్రం లోని కొన్ని చిట్కాలను పాటించడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా పసుపును సరిగ్గా ఉపయోగించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందట.

Exit mobile version