Site icon HashtagU Telugu

Vastu Tips: పర్స్ లో నెమలి పించం ఉంచడం మంచిదేనా.. అదృష్టం,ఐశ్వర్యం కలిసి వస్తుందా?

Peacock Feather

Peacock Feather

భారతీయులు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు అన్న విషయం తెలిసిందే.. వాస్తు ప్రకారంగా ఎన్నో విషయాలను కూడా పాటిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో నెమలి పించం కూడా ఒకటి. కొంతమంది వాస్తు శాస్త్ర ప్రకారం నెమలి పించంని ఇంట్లోనే పూజ గదిలో అలాగే కొన్ని దిశలలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల అనేక ఫలితాలు కలుగుతాయని నమ్మకం. అయితే నెమలి పించం ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లోనే లివింగ్ రూమ్ లో నెమలి పించంను ఏర్పాటు చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సానుకూల శక్తి పెరుగుతుందట.

స్నేహ సంబంధాలు మెరుగై ఇంట్లో అనువైన వాతావరణం నెలకొంటుందట. అలాగే పడకగదిలో నెమలి పించం పెట్టడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ అభిమానాలు పెరుగుతాయట. వారి అనుబంధం మరింత బలపడటమే కాకుండా దాంపత్య జీవితం కూడా ఆనందంగా సాగుతుందని చెబుతున్నారు.
అలాగే గార్డెన్ లేదా బాల్కనీలో నెమలి పించాలను పెట్టడం వల్ల సహజ సౌందర్యం పెరుగుతుందట. ఇలా పెట్టడం వల్ల వాతావరణంలో ఆహ్లాదకరంగా మార్చి కుటుంబ సభ్యుల ఎదుగుదలకు దోహదపడుతుందట. డబ్బులు ఉంచే లాకర్లో నెమలి పించంను పెట్టడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవడమే కాకుండా డబ్బుకు రక్షణ కలుగుతుందట. డబ్బు కూడా నిల్వ ఉంటుందని చెబుతున్నారు. చదువుకునే రూమ్ లేదా ఆఫీస్ రూమ్ లో నెమలి పించాలను ఉంచడం ద్వారా విద్యా, వృత్తి పరమైన విజయాలు సాధించవచ్చట.

ఇవి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచి, మన శ్రమకు మంచి ఫలితాలు తెస్తాయని చెబుతున్నారు. అలాగే చదువుల పట్ల చురుకుదనాన్ని పెంచి, మనసుకు శాంతి కలిగిస్తాయట. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెమలి పింఛంను పెట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందట. పూజ గదిలో నెమలిపించాలని పెట్టడం వల్ల ఆధ్యాత్మిక శక్తులను పెంచుతుందట. ఇంట్లో ఆగ్నేయ మూల, కిటికీలు వంటి ప్రాంతాల్లో నెమలి పించం ఉంచడం ద్వారా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెబుతున్నారు. అలాగే నెమలి పించంను పర్సులో ఉంచడం ద్వారా జీవితం సానుకూలంగా మారుతుందట. ఆర్థికంగా కలిసి వస్తుందని డబ్బు కూడా నిల్వ ఉంటుందని చెబుతున్నారు.