Site icon HashtagU Telugu

Varalakshmi Vratham 2024: వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ నైవేద్యాలను ఈ పుష్పాలను సమర్పించాల్సిందే!

Varalakshmi Vratham 2024

Varalakshmi Vratham 2024

స్త్రీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వరలక్ష్మి వ్రతం కూడా ఒకటి. అమ్మవారిని చాలా చక్కగా అందంగా అలంకరించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణమాసంలో జరుపుకుంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంతమంది అమ్మవారిని పూజిస్తారు కానీ అమ్మవారికి ఎలాంటి పుష్పాలు అంటే ఇష్టం ఎలాంటి నైవేద్యాలు అంటే ఇష్టం అన్న విషయం తెలియదు. మరి మీరు కూడా వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటుంటే అమ్మవారికి ఎలాంటి పూలను సమర్పించాలి. ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం తమపై కలిగి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా తమ కుటుంబాన్ని అభివృద్ధిలో నడిపిస్తూ, తన మాంగల్యాని పదికాలాల పాటు చల్లగా కాపాడుతుందని మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. మరి అమ్మవారికి ఎలాంటి పుష్పాలు ఇష్టం అన్న విషయాన్ని వస్తే.. అమ్మవారి అలంకరణలో భాగంగా కలువ పువ్వులు, మొగలి పువ్వులు, సంపెంగ పూలు, మల్లె పువ్వులతో పూజ చేయటం వల్ల అమ్మవారికి ఎంతో ప్రీతి చెంది ఆమె అనుగ్రహం కలుగుతుందట. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేసేవారు అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది రకాల పిండి వంటలు సమర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

మరి అమ్మవారికి ఇష్టమైన ఆ తొమ్మిది రకాల పిండి వంటలు ఏంటి అన్న విషయానికి వస్తే.. పూర్ణం బూరెలు, బొబ్బట్లు, పులగం, చలిమిడి, సెనగలు, వడపప్పు, పులిహోర, కేసరి, పంచా మృతాలను నైవేద్యంగా సమర్పించి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన తర్వాత అమ్మవారి కథ చదివి సాయంత్రం ఐదుగురు లేదా తొమ్మిది మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలతో పాటు పండ్లు వాయనంగా ఇవ్వడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందట. అయితే వరలక్ష్మీ వ్రతం చేసే వారు తప్పనిసరిగా ఉపవాసంతో వరలక్ష్మీ వ్రతం చేయటం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. కాబట్టి వరలక్ష్మీ వ్రతాన్ని చేసేవారు పైన చెప్పిన విధంగా అమ్మవారిని ఆ పూలతో అమ్మవారిని అలంకరించి నైవేద్యాలు సమర్పించడం వల్ల కోరిన కోరికలు తీర్చి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.