Varalakshmi Vratham 2024: వరలక్ష్మి వ్రతంలో కలశం ఇలా ఏర్పాటు చేసుకోవాలి.. అందులో ఏమేమి వెయ్యాలో తెలుసా?

వరలక్ష్మీ వ్రతం రోజున ఏర్పాటు చేసే కలశం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Vastu Tips

Varalakshmi Vratham 2024

శ్రావణమాసంలో స్త్రీలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో వరలక్ష్మీ వ్రతం కూడా ఒకటి. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఈ ఏడాది ఆగస్టు 16న శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోనున్నారు. అమ్మవారికి పూజ చేయడం మంచిది కానీ పూజలో కొన్ని రకాల పొరపాట్లు చేస్తే అమ్మవారి ఆగ్రహానికి లోన ఒక తప్పదు. ముఖ్యంగా లక్ష్మిని ఇంట్లో ప్రతిష్టించినప్పుడు. ఇందులో లక్ష్మికి ఇష్టమైన అన్ని అంశాలు ఉంటాయి. ఆరాధన అసంపూర్తిగా ఉండాలి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కలశం ఏర్పాటు చేసుకోవడం అన్నది ప్రధానంగా చెప్పవచ్చు. మరి ఆ కలశాన్ని ఏ విధంగా తయారు చేయాలి. ఆ కలశంలో ఏమేమి ఉంచాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కలశం అమ్మవారికి ప్రతిరూపం. కలశ పాత్రగా మట్టి పాత్రనుగాని, వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను వినియోగిస్తారు. లోహమైనా మట్టి అయినా అది పృథ్వీతత్తానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్తానికి సంకేతం. అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కాబట్టి శూన్యస్థితి ఆకాశతత్తానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్తానికి సంకేతం. దాని ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఇలా పంచభూతాలను ఒకచోటికి చేర్చి పూజిస్తాం. అమ్మవారు పంచభూతమయి కనుక కలశ స్థాపనతో ఆరాధించడం ఆనవాయితీ. కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడగాలి. తర్వాత దానికి పసుపు, కుంకుమలతో అలంకరించాలి.

బియ్యం పోసి వేదికను సిద్ధం చేయాలి. వేదికను పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు జల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. దానికి తాంబూలం సమర్పించి ఆరాధించాలి. కలశంలో నీరు పోసి మామిడాకులు కానీ, తమలపాకులు కాని అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ నుంచి దానికి రవికెల గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖ స్వరూపం వచ్చేలా కళ్ళు ముక్కు, పెదవులు, కనుబొమలు అమరేలా దిద్దవచ్చు లేదా అమ్మవారి రూపును దానికి తగిలించి ఆకారం ఏర్పరచవచ్చు.

దానికి తమకు తోచిన నగలు వగైరాలు అలంకరించవచ్చు. ఇక కలశంలో బియ్యం, మామిడి ఆకులు 5,జీడిపప్పు 5, ద్రాక్ష 5, పొడి ద్రాక్ష, నాణేలు 5, పసుపు, కుంకుమ, చిన్న బ్లాక్ పాంథర్, ఖర్జూరం1, గోమతి చక్రం 8, బాదం 8, జీడిపప్పు 8, బంగారం వస్తువు, వెండి వస్తువు, ముత్యం, పగడం 5 రకాల ధాన్యం, ఒక నిమ్మరసం, మామిడి ఆకు.. పైన చెప్పిన వస్తువులన్నింటిని ఉపయోగించక పోయినా అందులో కనీసం ఎనిమిది వస్తువులను తప్పనిసరిగా ఉపయోగించాలని చెబుతున్నారు.

  Last Updated: 14 Aug 2024, 01:38 PM IST