Site icon HashtagU Telugu

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం రోజు ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!

Varalakshmi Vratam

Varalakshmi Vratam

శ్రావణమాసంలో స్త్రీలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలలో వరలక్ష్మీ వ్రతం కూడా ఒకటి. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి మందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఈ ఏడాది శ్రావణ శుక్రవారం ఆగస్టు 16వ తేదీ ఈ రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోనున్నారు. ఈ రోజున సింహ రాశిలో పూజ సమయం ఉదయం 05:57 నుండి 08:14 వరకు ఉంటుంది. వృశ్చిక రాశిలో పూజ సమయం మధ్యాహ్నం 12:50 నుంచి 03:08 వరకు ఉంటుంది.

కుంభ రాశిలో పూజ సమయం సాయంత్రం 06:55 నుంచి రాత్రి 08:22 వరకు వృషభ రాశిలో రాత్రి 11:22 నుంచి ఉదయం 01:18 వరకు పూజ సమయం ఉంటుంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం స్నానం చేసి లక్ష్మీ దేవిని పూజించి, లక్ష్మీ దేవి పాదాల వద్ద 11 పసుపు కొమ్ములను సమర్పించాలి. తరువాత గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, వాటిని అల్మారాలో లేదా భద్రంగా ఉంచాలి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల సంతోషం, ఐశ్వర్యం, సంపదలు పెరుగుతాయని నమ్మకం.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజించాలట. ఈ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించాలట. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ఆర్థికంగా లాభాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు పండితులు. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఆ అప్పుల బాధ నుంచే బయటపడాలంటే లక్ష్మీదేవిని విష్ణుమూర్తి ని నియమనిస్తులతో పూజించాలట. అలాగే లక్ష్మీదేవికి బియ్యం బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు.

note : పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని అందించడం జరిగింది.