Sravana Sukravaram Pooja : శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం, లేదా రెండో శుక్రవారం నాడు హిందూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పవిత్ర వ్రతమే వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఐశ్వర్య సంపద, కుటుంబ సౌఖ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. సుమంగళి స్త్రీలు దీర్ఘకాలం సుఖంగా ఉండేందుకు ఈ వ్రతం ప్రత్యేకంగా చేస్తారు.
వ్రతం వెనక పురాణ కథ:
లక్ష్మీదేవి ఒకనాడు చారుమతి అనే సాధ్వీకి కలలో ప్రత్యక్షమై ఈ వ్రతాన్ని ఆచరించాలని తెలియజేసిందని పురాణ కథనం. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు… నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు. అప్పటి నుండి ఈ వ్రతం విస్తృతంగా ఆచరించబడుతోంది. సుమంగళి స్త్రీలు మాత్రమే కాకుండా, ఇంట్లో ఐశ్వర్యం కోరుకునే ప్రతి ఒక్కరు దీన్ని జరపవచ్చు. ఇందులో అతి ముఖ్యమైనది నిష్ట, భక్తి, శ్రద్ధ.
వరలక్ష్మీ వ్రత పూజా విధానం (ఇంట్లో సులభంగా చేయగల విధానం):
వ్రతం చేసే రోజు (శుక్రవారం) ముందుగా చేయవలసిన పనులు:
.తెల్లవార్జున లేచి శుచి చేసుకుని తలస్నానం చేయాలి
.ఇంటిని శుభ్రంగా కడిగి పూజా మందిరంలో మండపం ఏర్పాటుచేయాలి
.మండపంపై బియ్యపు పిండి తో ముగ్గు వేసి, కలశాన్ని అమర్చాలి
.కలశంపై కొబ్బరి కాయపై ఆవిడర బొమ్మ లేదా అమ్మవారి ఫొటో పెట్టాలి
వ్రతానికి అవసరమైన పూజా సామగ్రి:
.పసుపు, కుంకుమ
.గంధం, విడిపూలు, పూలమాలలు
.తమలపాకులు, వక్కలు (30), ఖర్జూరాలు
.అగరబత్తీలు, కర్పూరం
.తెల్ల దుస్తులు, రవిక, మామిడి ఆకులు
.ఐదు రకాల పండ్లు
.బియ్యం, నైవేద్యాలు, పంచామృతాలు
.కొబ్బరి కాయలు, కలశం
.తెల్ల దారం లేదా పసుపు రాసిన కంకణం
.నెయ్యితో దీపాలు, ఒత్తులు, చిల్లర పైసలు
పూజా విధానం:
గణపతి పూజ:
ముందుగా “వక్రతుండ మహాకాయ” మంత్రంతో గణపతిని ఆరాధించాలి.
షోడశోపచార పద్ధతిలో పూజ చేయాలి.
తోరాల తయారీ:
తెల్ల దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకుని, పసుపు రాసి దానిపై పూలు కట్టి ముడులు వేయాలి.ఈ తోరాలను పూజించి అమ్మవారి చేతికి కట్టాలి లేదా పూజాపీఠంపై ఉంచాలి.
లక్ష్మీదేవి పూజ:
అమ్మవారి నామాలతో పుష్పార్చన చేయాలి.
“ఓం మహాలక్ష్మ్యై నమః”,
“ఓం శ్రీ వసుధాయై నమః”,
“ఓం పద్మమాలిన్యై నమః” వంటి నామాలతో పుష్పాలు సమర్పించాలి.
పంచామృతాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి.
గాయత్రీ మంత్రంతో అభిషేకం:
‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం…’ మంత్రంతో నీరాజనం చేయాలి.
అనంతరం ఫలాలు, నీళ్లు, తాంబూలం సమర్పించాలి.
దీపారాధన మరియు హారతి:
కర్పూరం వెలిగించి, హారతి ఇవ్వాలి.
‘‘ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి’’ అంటూ హారతి ఇవ్వలి.
వ్రత మహాత్మ్యం:
ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం, ధాన్యం, విద్య, ఆయుష్షు, సంతానం, ప్రశాంతత, ఐశ్వర్యం, విజయములు సిద్ధిస్తాయని పురాణ ప్రబంధాలు చెబుతున్నాయి. వ్రతానంతరం వరలక్ష్మీదేవికి తలమీద అక్షతలు వేసుకుంటూ నమస్కరించాలి.
శ్రద్ధ, భక్తితో చేయడమే ముఖ్యమైన నియమం.
నిశ్చల భక్తితో ఈ వ్రతాన్ని జరిపినవారికి మాతా లక్ష్మీ కృప కలుగుతుంది.
ఆ రోజు వీలుకాకపోతే ఇతర శుక్రవారాల్లో కూడా వ్రతం చేయవచ్చు. కాగా, లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.