Site icon HashtagU Telugu

Vaishakha Masam: వైశాఖమాసంలో ఈ దానాలు చేస్తే చాలు.. అఖండ మోక్ష ప్రాప్తి కలగడం ఖాయం!

Vaishakha Masam

Vaishakha Masam

మామూలుగా మనకు ఉన్నంతలో దానధర్మాలు చేస్తే మంచి ఫలితం కలుగుతాయని పండితులు చెబుతూ ఉంటారు. మిగతా రోజులతో పాటు వైశాఖమాసంలో చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి వైశాఖమాసంలో ఎలాంటి వస్తువులు దానం చేయాలి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే… వైశాఖ మాసంలో మంచముపై మంచి ఆచ్చా దనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానం చేయువారి వంశంలో అందరూ చక్రవర్తి సమానులై, శారీరక, మానసిక బాధలు లేకుండా సుఖ శాంతులతో అభివృద్ధి చెంది, కీర్తి ప్రతిష్ఠలను పొందవచ్చట.

అలాగే సద్బ్రాహ్మణునకు మంచముపై పరుపుతో పాటుగా దిండును కూడా దానం చేస్తే ఐశ్వర్యం పొందవచ్చట. సద్బ్రాహ్మణుని సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును దానంగా ఇస్తే ఏడు జన్మల వరకు సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నింట విజయం లభిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు చల్లదనాన్ని ఇచ్చే గడ్డి, తుంగ మొదలైన వాటితో తయారు చేసిన చాపను దానం ఇస్తే శ్రీమహావిష్ణువు ప్రీతి చెందుతారట. అలాగే వైశాఖ మాసంలో ఊర్ణ, ఉన్ని, గొఱ్ఱె బొచ్చుతో తయారు చేసినవి, నీటిలో పడినా తడిసిపోని వంటి వాటిని దానం చేస్తే సంసార బాధలు ఉండవట వైశాఖమాసంలో కంబళి దానం చేసిన వారికి అపమృత్యువు, అకాల మృత్యు భయాలు తొలగిపోతాయట.

ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి చిరకాలము నిశ్చింతగా ఉండవచ్చని చెబుతున్నారు. వీటితోపాటు కొబ్బరికాయలు మామిడిపండు దానం ఇస్తే ఏడు జన్మల వరకు బ్రహ్మనుడై జన్మించడంతోపాటు వేద పండితుడు ధనవంతుడుగా ఏడు తరముల వారికి ముక్తి లభిస్తుందట. అలాగే వైశాఖమాసంలో వేసవిలో అలసిపోయిన వారికి మజ్జిగ దానం చేసిన వారు విద్యనవంతులు ధనవంతులు అవుతారని చెబుతున్నారు. అలాగే పేదలకు నిస్సహాయులకు కావలసినవి అవసరమైన విధానం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు.