Site icon HashtagU Telugu

Vaishakh Purnima 2025: పేదరికం వెంటాడుతోందా.. వైశాఖ పౌర్ణమి రోజున దీపంతో ఈ పరిహారం చేయాల్సిందే!

Vaishakh Purnima 2025

Vaishakh Purnima 2025

హిందూ మతంలో పౌర్ణమి, అమావాస్య తిధులు ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణ భింబంగా దర్శనమిస్తాడు. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడికి ఆర్గ్యం సమర్పించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందట. పౌర్ణమి తిథి విష్ణువు, లక్ష్మీదేవి పూజకు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుందట. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుందని, పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజుని బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు.

ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ 2025 మే 12న వచ్చింది. ఈ శుభ తిది రోజున శుభ సమయంలో దీపానికి సంబంధించిన ఒక సాధారణ పరిహారం చేస్తే కోరుకున్న ఫలితం పొందుతారట. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో నాలుగు చోట్ల దీపాలు వెలిగించాలని దీనివల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి తిథి మే 11 సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పౌర్ణమి తిధి మే 12న రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమిను మే 12న జరుపుకోనున్నారు. ఇంతకీ ఆ నాలుగు దీపాలు ఎక్కడ వెలిగించాలి అన్న విషయానికి వస్తే.. వైశాఖ పౌర్ణమి రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉందట. ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలట.

వైశాఖ పౌర్ణమిన ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుందట. అలాగే వైశాఖ పౌర్ణమి సందర్బంగా తులసి మొక్కను పూజించాలట. తరువాత తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని ఆ వ్యక్తి అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలట. వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి పూజ గదిలో లేదా పూజ చేసే ప్రార్ధనా స్థలంలో దీపం వెలిగించాలట. ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుందట. ఆర్థిక లాభం తెస్తుందని చెబుతున్నారు. అలాగే వైశాఖ పౌర్ణమి రోజున మీరు వంటగదిలో దీపం వెలిగించాలట. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవి ప్రసన్నం అవుతుందని, ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతున్నారు.

Exit mobile version