Site icon HashtagU Telugu

Vaikuntha Ekadashi: 2025లో మొదటి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? ఉపవాస విరమణ పూర్తి వివరాలు ఇవే!

Vaikuntha Ekadashi

Vaikuntha Ekadashi

మామూలుగా సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశి తిథిలు ఉంటాయి. అందులో వైకుంఠ ఏకాదశి కూడా ఒకటి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏకాదశి వ్రతం కూడా చేస్తూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి విష్ణుమూర్తి నిదర్శించుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సమయం దగ్గర పడింది. కాగా వైకుంఠ ఏకాదశిని మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి రోజున జరుపుకుంటారు.

ఈ నేపధ్యంలో 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 9, గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది శుక్రవారం జనవరి 10 ఉదయం 10:19 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు. వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జనవరి 11వ తేదీ శనివారం ఉదయం 7:15 నుంచి 8:21 వరకు ఏకాదశి ఉపవాసం విరమణ కు శుభ సమయం ఉంటుంది.

శుభ ముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయుని చెబుతున్నారు. కాగా ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున చేసే పూజలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే విష్ణుమూర్తి ని దర్శించుకోవడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.