Site icon HashtagU Telugu

Sacred Herb: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో చాలు.. మీకు తిరుగే లేదు.. ఏ రోజు పూజించాలో మీకు తెలుసా?

Sacred Herb

Sacred Herb

మామూలుగా మనం వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. అయితే ఇంకొందరు తెలిసి తెలియక ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. వాటి వల్ల లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో కొన్ని రకాల మొక్కలు తప్పనిసరి అని చెబుతున్నారు. వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆర్థికపరంగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు అని చెబుతున్నారు.

ఇంతకీ ఆ మొక్క ఏమిటి ఆ మొక్కను ఎప్పుడు పూజిస్తే మంచి జరుగుతుంది అన్న వివరాల్లోకి వెళితే.. ఆ మొక్క మరేదో కాదు ఉత్తరేణి. పౌర్ణమి రోజున ఈ మొక్క మూలానికి పంచోపచార పూజ చేయడం వల్ల జీవితంలోని పెద్ద సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. వినాయక చవితి పత్రిలో కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు. ఉత్తరేణి వేరును మణికట్టు లేదా చేతిపై తాయెత్తు రూపంలో ధరిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయట. తెల్లటి ఉత్తరేణి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయట. చెడు దృష్టి నుంచి రక్షణ కోసం దీని వేర్లను పూజించి కుడి చేతికి ధరించడం శ్రేయస్కరం అని చెబుతున్నారు.

శుభ ముహూర్తంలో ఉత్తరేణి వేరును ఇంట్లో సురక్షితమైన స్థలంలో ఉంచితే ధనప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. ఈ విధంగా ఉత్తరేణి మొక్కను పూజించడం వల్ల ఆధ్యాత్మికంగాను, దీనిని ఔషధంగా ఉపయోగించడం వల్ల శారీరకంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఉత్తరేణి మొక్క ఇంట్లో ఉండడం వల్ల మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా తొలగిపోతాయట. కాబట్టి మీ ఇంట్లో ఈ ఉత్తరేణి మొక్క లేకపోతే వెంటనే నాటుకొని ప్రతి పౌర్ణమి సమయంలో పూజించడం మంచిది. ఈ ఉత్తరేణి మొక్క వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఉత్తరేణిని తయారీలో కూడా ఉపయోగిస్తారు.