కార్తీక మాసంలో(Karthika Masam) ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలని చెబుతారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరి దీపం(Usiri Deepam) పెడతారు. కార్తీక మాసంలో మనం దీపాలు పెడుతుంటాము. దీపాలను పత్తితో చేసిన వత్తులను, ఆవు నెయ్యిని(Cow Ghee) ఉపయోగించి దీపాలు వెలిగిస్తాము. ఇంకా ఉసిరి దీపాలను కూడా కొంతమంది వెలిగిస్తూ ఉంటారు. అయితే ఉసిరి(Goose Berry) చెట్టు సాక్షాత్తు శివుని స్వరూపం అని, బ్రహ్మ, విష్ణువు సకల దేవతలు ఉసిరి చెట్టులో కొలువై ఉండే వృక్షం అని పురాణాల్లో చెబుతారు.
ఉసిరి(Amla) దీపం పెట్టడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే ఉసిరికాయ మీద దీపం ఎలా పెడతారో తెలుసుకుందాము. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగిస్తే ఎంతో మంచిది, గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి అని భావిస్తారు భక్తులు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం పెడితే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది.
ఉసిరికాయను పైన మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపం పెట్టుకోవడానికి తయారవుతుంది. దానిలో నెయ్యి నింపి తామర కాడల వత్తులను లేదా పట్టి వత్తులను వేసి ఉసిరి దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగించడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఇంకా నరదిష్ఠి ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఉసిరికాయ అంటే లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టం. కార్తీకమాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి విష్ణువు, లక్ష్మీ దేవిల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి కార్తీకమాసంలో ఉసిరి దీపం పెడితే ఎంతో మంచిది.