Anjaneya Swamy Sindhur: ఆంజనేయస్వామి సింధూరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Anjaneya Swamy Sindhur : చాలామంది మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆరోజు నుదుటిన ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటారు. అయితే.. ఆంజనేయస్వామి సింధూరాన్ని నుదిటిన పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరింట్లో అయినా నిత్యం కలహాలు జరిగితే వాళ్లు ప్రతి రోజు నుదిటిన సింధూరం పెట్టుకోవాలి. అప్పుడు దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కొందరు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఇంట్లోనూ అశాంతి ఉంటుంది. భీతి, భయం లాంటివి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి […]

Published By: HashtagU Telugu Desk
Hanuman Sindoor

Hanuman Sindoor

Anjaneya Swamy Sindhur : చాలామంది మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆరోజు నుదుటిన ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటారు. అయితే.. ఆంజనేయస్వామి సింధూరాన్ని నుదిటిన పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరింట్లో అయినా నిత్యం కలహాలు జరిగితే వాళ్లు ప్రతి రోజు నుదిటిన సింధూరం పెట్టుకోవాలి. అప్పుడు దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కొందరు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఇంట్లోనూ అశాంతి ఉంటుంది. భీతి, భయం లాంటివి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటిన ధరించండి. మీ భయాలన్నీ తొలగిపోతాయి.

ఇక.. విద్యార్థులు పరీక్ష సమయంలో హనుమాన్ టెంపుల్ కు వెళ్లి నుదుట సింధూరం పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివినవి అన్నీ గుర్తుంటాయి. పరీక్షను బాగా రాస్తారు. ఏవైనా గ్రహాలతో పీడింపబడే వాళ్లు.. ప్రతి రోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తప్పుతుంది. ఇంట్లో కూడా ఆంజనేయస్వామికి సింధూరాన్ని పూయొచ్చు. అటువంటి వాళ్లు దేవుడి విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచి సింధూరాన్ని స్వామి కిరీటానికి పెట్టండి. గంధాన్ని పాదాల వరకు పూసి ఆ తర్వాత దేవుడిని నిష్టతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.

కొందరి ఇంట్లో భార్యాభర్తలు, పిల్లల మధ్య సరైన సఖ్యత ఉండదు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్లు ఖచ్చితంగా సింధూరం పెట్టుకుంటే గొడవలు తగ్గుతాయి. బాలగ్రహ దోషాలు ఉన్న చిన్నపిల్లలకు నిత్యం సింధూరం పెడితే భయం కానీ, రోగ బాధలు కానీ.. బాలగ్రహ దోషాలు కానీ పోతాయి. భయం, భీతి, రోగ బాధలు ఏవీ దరిచేరవు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కొత్తగా వివాహం అయిన వాళ్లు కూడా కొన్ని రోజుల పాటు నిత్యం ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్లకు ఆంజనేయస్వామి అనుగ్రహం కూడా ఉంటుంది.

  Last Updated: 28 Nov 2023, 11:50 AM IST