Saturn Ring In Palm:మీ అరచేతిలోని “శని వలయం” ఏమేం చేస్తుందో తెలుసా ?

ఈరోజు మీ చేతిలో ఉండే ఒక ముఖ్యమైన రేఖ గురించి తెలుసుకుందాం. అదే "శని వలయం"!!

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 03:01 PM IST

ఎవడి రాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది అంటారు పెద్దలు.

ఎవరి తల రాతను ఎవరు తవ్పించగలరు అని కూడా అంటారు.

జ్యోతిషానికి జాతకచక్రం, హస్త సాముద్రికం రెండు కళ్ల లాంటివి.

ఈరోజు మీ చేతిలో ఉండే ఒక ముఖ్యమైన రేఖ గురించి తెలుసుకుందాం. అదే “శని వలయం”!!

శనివలయం మీ అరచేతి మధ్య వేలుకు సరిగ్గా కింది భాగంలో అర్ధ వృత్తాకారంలో ఉంటుంది. హస్త రేఖా శాస్త్రం ప్రకారం.. దీన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇది ఉన్నవాళ్లు సుఖ, సంతోషాలు లేని జీవితాలను గడపాల్సి వస్తుందని అంటారు. శనివలయం యాక్టివ్ గా ఉన్నవాళ్లు అందరి మధ్య ఉదాసీనంగా ఉంటారని చెబుతారు. వీళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటారు. శని వలయం ప్రభావం వల్ల వీళ్ళు ఎన్నో మాటలు చెప్పినా.. చేతల్లో ఏమీ చేయలేక వెనుకబడి పోతుంటారు. కష్టపడే తత్వం కూడా ఉండదు. ఇలా అరచేతిలో శని వలయంతో పాటు.. సరిగ్గా అరచేయి మధ్యలో ఉండే గీత చిన్న సైజులో ఉంటే గనుక వారికి ఒంటరిగా జీవించడం అంటే ఇష్టంగా ఉంటుంది.

* శని వలయం ఇంకొన్ని అంశాలను కూడా తెలియజేస్తుంది. ఒకవేళ శని వలయం క్రిస్టల్ క్లియర్ గా, తేటగా ఉంటే .. ఆ వ్యక్తికి ఇంటలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారు శాంతంగా ఉంటారు.తమ విజయ రహస్యాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా మెలుగుతారు.నేరాలకు పాల్పడే వారు, ఆత్మహత్య చేసుకునే వారి చేతిలోనూ శని వలయం ఇదే విధంగా ఉంటుంది.

* ఒకవేళ అర చేతిలో శని వలయం క్లియర్ గా లేకుంటే వేరే పరిణామాలు ఉంటాయి. ఇలాంటి వారు కమ్యూనికేషన్ స్కిల్స్ లో వీక్ గా ఉంటారు. వీళ్లకు కూడా ఒంటరితనం అంటే లైక్. అందుకే కొందరు పెళ్లి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ గ్రూప్ లోని వాళ్ళు నేరాలు, ఆత్మహత్యలకు దూరంగా ఉంటారు.

* ఒకవేళ అర చేతిలో శని వలయం రేఖ విరిగిపోయి ఉంటే బాధపడాల్సిన అవసరం లేదు.ఇటువంటి వారికి అర చేతి మధ్యలో ఉండే హెడ్ లైన్ గీత , బొటన వేలుపై ఉండే రేఖలు తేటగా, బలంగా ఉంటే..జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ.

* ఒకవేళ శని వలయం అర్ధ వృత్తాకారంలో కాకుండా ముల్లులాంటి ఆకారంలో ఉంటే ఇబ్బందికరం. ఇలాంటి వారిలో
అర చేతి మధ్యలో ఉండే హెడ్ లైన్ గీత , బొటన వేలుపై ఉండే రేఖలు కూడా బలహీనంగా ఉంటే జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళు అందరితో కలువరు. ఎప్పటికీ నిరాశావాదంతో ఉంటారు. జీవితంలో పెద్దగా విజయాలను సాధించలేరు.