Site icon HashtagU Telugu

Bhagavad Git : భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

UNESCO recognizes Bhagavad Gita

UNESCO recognizes Bhagavad Gita

Bhagavad Git : భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమొరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు దక్కింది. భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి యునెస్కో మెమరీ ఆఫ్‌ ది వరల్డ్‌ రిజిస్టర్‌ లో చోటు దక్కింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తంచేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణమైన క్షణం. యునెస్కో ‘మెమరీ ఆఫ్ ది వరల్డ్‌’ రిజిస్టర్‌లో భగవద్గీతతో పాటు నాట్యశాస్త్రం చేర్చబడటం, భారతదేశం సాంస్కృతిక వారసత్వానికి, శాస్త్రీయ జ్ఞానానికి ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపు అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

కాగా, భగవద్గీతను భవిష్యత్ తరాలకు అందేలా సంరక్షించేందుకు అంతర్జాతీయ సహకారంతో పాటు నిధుల సమీకరణకు యునెస్కో గుర్తింపు ఉపయోగపడుతుంది. యునెస్కో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, పరిశోధకులు, స్కాలర్లు.. భగవద్గీత తాత్విక, సాహిత్య, చారిత్రక అంశాలపై మరింత అధ్యయనం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. గ్రంథం చారిత్రక, సాంస్కృతిక విలువను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం చేసేందుకు దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతపై అవగాహననూ పెంచుతుంది. అంతేకాదు, పురాతన లిపుల్లో ఉన్న భగవద్గీత డిజిటలైజేషన్‌ కూడా.. యునెస్కో గుర్తింపు వల్ల సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ పూర్తైతే.. భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా మరింత సులభంగా అందుబాటులో ఉంటుంది.

Read Also: Happy Birthday KL Rahul: నేడు కేఎల్ రాహుల్ పుట్టినరోజు.. రాహుల్ క్రికెట్ కెరీర్ ఇదే!