Ugadi 2024 : ఈ సంవత్సరం ఏమేం జరుగుతాయో చెప్పేసిన ‘నవనాయక ఫలితాలు’

Ugadi 2024 : ఇవాళే తెలుగువారి నూతన సంవత్సరం.  సోమవారం అమావాస్యతో శ్రీ శోభకృత నామసంవత్సరం ముగిసి మంగళవారం క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది.

  • Written By:
  • Publish Date - April 9, 2024 / 09:03 AM IST

Ugadi 2024 : ఇవాళే తెలుగువారి నూతన సంవత్సరం.  సోమవారం అమావాస్యతో శ్రీ శోభకృత నామసంవత్సరం ముగిసి మంగళవారం క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. కలి గతాబ్దికి ప్రకారం.. నేటితో ఈ పుడమికి 5125 ఏళ్లు నిండుతాయి. క్రీస్తుశకం ప్రకారమైతే మనం 2024-25 సంవత్సరంలో ఉన్నాం.  శాలివాహన శకం ప్రకారం..మనం 1946 సంవత్సరంలో ఉన్నాం. ఏదిఏమైనప్పటికీ ఇది తెలుగువారి నూతన సంవత్సరం. ఇవాళ షడ్రుచులు, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు.. ఆరు రుచులు కలిపిన పచ్చడిని చేసుకుని కుటుంబ సభ్యులు మొత్తం తాగుతుంటారు. పంచాంగ శ్రవణం విని, ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది. వారికి ఈ క్రోధినామ సంవత్సరం కలిసి వస్తుందా లేదా అనేది తెలుసుకుంటారు. నవనాయక ఫలితాలను బట్టి ఈ ఏడాది ఎలా ఉండబోతోందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

క్రోధినామ సంవత్సరం అంటే ?

క్రోధినామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా ఉంటుందట. ఈ సంవత్సరంలో ప్రజలు అధిక కోపం, ఆవేశంతో రగిలిపోతారని, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు పండితులు. ఈ సంవత్సరం దేశంలో, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కలుగుతాయంట. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే రిస్క్ ఉందని అంచనా వేస్తున్నారు. అనారోగ్య సమస్యలు కూడా అధికం అవుతాయని వార్నింగ్ ఇస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

నవనాయక ఫలితాలు ఇలా ఉన్నాయ్..

క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి-శుక్రుడు. నవనాయక ఫలితాల ఆధారంగా ఈ సంవత్సరం  మిశ్రమ పరిస్థితులు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరానికి ధాన్యాధిపతి-రవి,  రాజవాహనం- నౌక, పశుపాలకుడు-యముడు, గోష్ఠాగార ప్రాపకుడు (స్థాన సంరకక్షుడు)- శ్రీకృష్ణుడు, మేఘాధిపతి-శుక్రుడు,  సస్యాధిపతి-కుజుడు, అర్ఘ్యాధిపతి-శుక్రుడు, రసాధిపతి-గురు, నీరసాధిపతి-కుజుడు. వీరిలో ఎవరెవరి ప్రభావం వల్ల ఈ ఏడాది ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

రెండు తూముల వర్షం

ఈ సంవత్సరానికి రాజు కుజుడు కావడంతో రెండు తూముల భారీ వర్షం కురుస్తుందని అంటున్నారు.  లోకంలో అగ్నిభయం, శస్త్ర భయం పెరుగుతాయట. పంటల దిగుబడి తగ్గుతుంది. దొంగల భయం పెరుగుతుంది. యుద్ధ వాతావరణం ఉంటుంది. బొగ్గు, పెట్రోలు, బంగారం, వెండి, ఇనుము, ఇత్తడి, ఉల్లిగడ్డలు, తేయాకు, పసుపు, సిమెంటు తదితర వస్తువుల ధరలు పెరుగుతాయి.

ఆకలి బాధలు

ఈ సంవత్సరానికి రాజ వాహనం నౌక కావడంతో  ఆకలి బాధలు పెరుగుతాయి. కరువు పరిస్థితులు నెలకొంటాయి. పశువులకు నష్టం వాటిల్లుతుంది.

పాలకులు పీడిస్తారు

ఈ సంవత్సరానికి మంత్రిగా శని ఉండటం వల్ల  వర్షం చాలా తక్కువగా కురుస్తుంది. పంట విస్తీర్ణం తగ్గిపోతుంది. పాలకులు ప్రజలను పీడిస్తారు. ధన, మాన, ప్రాణ హాని కలుగుతుంది.

స్త్రీలకు రక్షణ కరువు

ఈ సంవత్సరానికి సేనాధిపతిగా శుక్రుడు ఉన్నందున వర్షపాతం మోస్తరుగా కురుస్తుంది. పత్తి, నూలు, దుస్తులు, బంగారం ధరలు పెరుగుతాయి. స్త్రీలకు రక్షణ కరువవుతుంది.

Also Read :Glaucoma : లక్షణాలు బయటపడవు.. కానీ కళ్లుపోతాయ్.. ‘గ్లకోమా’ డేంజర్ బెల్స్!

ఎర్ర నేలలకు మంచి కాలం

ఈ సంవత్సరానికి సస్యాధిపతిగా కుజుడు ఉన్నందున ఎర్ర నేలలకు మంచి కాలం. కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. మాగాణి పంటలు అంతగా పండవు.

బంగారం, వెండికి రెక్కలు

ఈ సంవత్సరానికి ధాన్యాధిపతిగా రవి ఉన్నందున వర్షాలు తక్కువగా కురుస్తాయి. రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతాయి. సమాజంలో దుష్ట చింతన పెరుగుతుంది. బంగారం, వెండి ధరలు పెరిగి నిలకడగా ఉంటాయి.