Site icon HashtagU Telugu

Ugadi 2025: ఉగాది పండుగ రోజు పొరపాటున కూడా చేయకూడని ఐదు ముఖ్యమైన పనులు ఇవే!

Ugadi 2025

Ugadi 2025

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. ఇంకా చెప్పాలి అంటే ఈ ఉగాది పండుగను మొదటి పండుగగా కూడా పిలుస్తారు.. అసలైన నూతన సంవత్సరం ఉగాది పండుగ తోనే తెలుగు వారికి మొదలవుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ ఉగాది పండుగ రోజున చేయకూడనివి చేయాల్సినవి కొన్ని రకాల పనులు. చేయాల్సిన పనులు సంగతి పక్కన పెడితే చేయకూడని పనులు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. ఒకవేళ తెలిసి తెలియక చేసే ఆ తప్పుల వల్ల ఏడాది మొత్తం అలాంటి ఫలితాలే అనుభవించే అవకాశాలు ఉంటాయట.

ముఖ్యంగా ఐదు రకాల పనులు తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఉగాది పండుగ రోజు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉగాది పండుగ రోజు డబ్బు అప్పుగా ఎవరికైనా ఇస్తే ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదట. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఉగాది పండుగ రోజు అప్పు ఇవ్వకూడదని చెబుతున్నారు. అలాగే ఉగాది పండుగ రోజు ఎవరితోనో వాదించడం పోట్లాడటం వంటివి అసలు చేయకూడదట. ఇలా చేస్తే ఏడాది మొత్తం అలాగే ఉంటుందని సమస్యలు వస్తూనే ఉంటాయని చెబుతున్నారు.

అలాగే ఒకరిని అవమానించడం కానీ వారిని అవహేళన చేస్తూ మాట్లాడడం కానీ ఒకరిని ఏడిపించడం కానీ మనం ఏడ్చడం కానీ అలాంటి పనులు ఏమీ చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేస్తే ఏడాది మొత్తం ఏడుస్తూ ఉండడం ఇతరులను ఏడిపిస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పండుగ రోజు కొత్త బట్టలు ధరించాలని నియమం కూడా ఉంది. అయితే కొత్త బట్టలు లేని వారు కనీసం ఒక్క బట్ట అయినా కొత్త బట్ట ధరించాలని చెబుతున్నారు. అలాగే విడిచిపెట్టిన దుస్తులు అంటే ఉతకని దుస్తులు అసలు ధరించకూడదట. అలాగే ఉగాది పండుగ రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలని కంఠ స్నానం చేయకూడదని చెబుతున్నారు. అలాగే ఉగాది పండుగ రోజు న నుదుటిన బొట్టు లేకుండా గడప దాటి బయట అడుగు పెట్టకూడదట. అలా అడుగుపెడితే వాహన ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే లేదు అని చెప్పకూడదట. ఎక్కడో పెట్టాను వెతుకుతున్నాను మరిచిపోయాను మళ్ళీ ఇస్తాను ఇలాంటి మాటలు చెప్పాలని లేదు అనే మాట నోటి నుంచి రాకూడదని పండితులు చెబుతున్నారు..