తెలుగు వారికీ ఉగాది పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలు అవుతుందన్న విషయం తెలిసిందే. ఒకొక్క తెలుగు సంవత్సరాన్ని ఒకొక్క పేరుతో పిలుస్తారు. ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు. అయితే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం జరుగుతోంది. ఈ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మార్చి 30 నుంచి మొదలు కానుంది. ఈ ఉగాది పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ సంప్రదాయంగా జరుపుకుంటారు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి తిధి 2025 మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఉగాది పండగను జరుపుకోనున్నారు.
ఈ రోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మొదలు కానుంది. ఈ రోజున ఉగాది పండగ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం. అంతేకాదు ఉదయం 9 గం.నుంచి 11.30 గం. కొత్త బట్టలు ధరించి యజ్ఞోపవీత ధారణ చేయవచ్చట. అంతేకాదు ఈ సముయం ఉగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని చెబుతున్నారు. అలాగే ఉగాది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఉగాది రోజున ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3 గం. మధ్యలో పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి మొదలైన శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చట.
ఇకపోతే ఉగాది పండుగ రోజు ఎలాంటి పనులు చేస్తే శుభప్రదం అన్న విషయానికొస్తే.. ఉగాది రోజును శుభ ప్రదంగా పరిగణిస్తారు. కాబట్టి ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలట. ఉగాది రోజున తెల్లవారు జామున అంటే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలట. తరువాత ఇంటిని శుభ్రం చేసి కాలకృత్యాలు తీర్చుకోవాలట. ఇంటి ముందు ముగ్గు వేయాలట. తరవాత అభ్యంగ స్నానం చేయాలట. అంటే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని కుంకుడు కాయలతో తలకు స్నానం చేయాలని చెబుతున్నారు. స్నానం తర్వాత కొత్త బట్టలను ధరించాలట. తప్పకుండా నుదుటిన బొట్టు పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇంటి గుమ్మానికి వేపకొమ్మలు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలట.