Haj 2024: హజ్ యాత్రకు ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు వెల్లడి

ముస్లింలు హజ్ యాత్రను పవిత్రమైన తీర్థయాత్రగా భావిస్తారు. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రపంచంలోని న‌లుమూలల నుండి సందర్శకులు వస్తుంటారు

Haj 2024: ముస్లింలు హజ్ యాత్రను పవిత్రమైన తీర్థయాత్రగా భావిస్తారు. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రపంచంలోని న‌లుమూలల నుండి సందర్శకులు వస్తుంటారు. ఏటా సగటున 2.2 మిలియన్లకు పైగా హజ్ ను సందర్శిస్తారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయాలనుకుంటారు. హజ్ యాత్ర తేదీలు ప్రతి సంవత్సరం భిన్నంగా ఉంటాయి.

హజ్ యాత్రికుల కోసం హజ్-2023 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ తేదీలను ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అధికారులు 2024లో హజ్ తీర్థయాత్ర చేయాలనుకునే వారి రిజిస్ట్రేషన్ తేదీలను ప్రకటించారు.యూఏఈ జనరల్ అథారిటీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 5 నుండి డిసెంబర్ 21 వరకు తెరవబడతాయి. యాత్రికులు Awqaf డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవచ్చు. పరిమిత కోటా కారణంగా వ్యక్తులు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంది. .

యూఏఈ ప్రభుత్వం సాధారణంగా ఎమిరాటీలకు మాత్రమే హజ్ అనుమతులను జారీ చేస్తుంది, అయితే ప్రవాసులు వారి స్వదేశాల కోటా మరియు విధానాల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. హజ్ 2024 జూన్ మధ్యలో ప్రారంభమవుతుంది. 2023లో మక్కాకు 1.8 మిలియన్లకు పైగా సందర్శించారు. COVID-19 ప్రభావం హజ్ యాత్రపై ప్రభావం చూపించింది.

Also Read: Devara : దేవర రెండో పార్ట్ ను ప్రకటించిన కొరటాల శివ