Site icon HashtagU Telugu

Spirtual: పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలు, ఫోటోలు ఉండవచ్చా.. అలా ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Spirtual

Spirtual

హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది తప్పనిసరిగా ఉంటుంది. ఈ పూజ గదిలో చాలామంది దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసి పూజలు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది పూజ గదిలో గమనిస్తే దేవుడు పటాలు విగ్రహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ దేవాలయానికి వెళ్లినా ఆ దేవుడి ఫోటోని, లేదా విగ్రహాలను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే కొందరు తెలిసి, తెలియక దేవుడి విగ్రహాలు, ఫోటోల విషయంలో చేసే కొన్ని పొరపాట్లు చాలా ఇబ్బందులకు దారి తీస్తాయట. ఈ విషయం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం.. పూజ గదిలో దేవతల విగ్రహాలు, పటాలను ఉంచే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలట. సరైన రకమైన విగ్రహాలు, వాటికి తగిన సంఖ్యను ఎంచుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. అలా కాదు అని ఈ నియమాలను ఉల్లంఘిస్తే అది కుటుంబ సభ్యుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు.

కాగా ఎవరి ఇంట్లో అయితే ఇంట్లో రెండు శివలింగాలు ఉంటాయో వారికీ మానసిక క్షోభ కలుగుతుందట. శివలింగ స్థలం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఒక్క శివలింగాన్ని మాత్రమే పూజించడం ఉత్తమం అని చెబుతున్నారు. అలాగే విఘ్నేశ్వరుడిని అడ్డంకులు తొలగించే దైవంగా భావించి ఆయనకు తొలి పూజ చేస్తూ ఉంటారు. అయితే మూడు గణపతి విగ్రహాలను ఇంట్లో ఉంచినట్లయితే అది శుభ ఫలితాలను ఇవ్వదట. ఇది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లేదా ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంట్లోని పూజ గదిలో రెండు శంఖాలు ఉండడం కూడా మంచిది కాదట. శంఖంని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. అందుకే దేవాలయాల్లో కూడా ఈ శంఖాలను ఉపయోగించి అభిషేకాలు చేస్తూ ఉంటారు.. పూజల సమయంలో శంఖానాదం చేయడం వల్ల దేవుడు ప్రసన్నం అవుతాడట. కానీ ఇంట్లో రెండు శంఖాలు ఉంచడం సరికాదని చెబుతున్నారు పండితులు. అలాగే సూర్య భగవానుడు శక్తికి చిహ్నంగా పరిగణించబడతాడు. ఈయన ప్రత్యక్ష దైవం.

అయితే ఇంట్లో రెండు సూర్య విగ్రహాలు లేదా సూర్య పటాలు ఉంచడం అసలు మంచిది కాదని చెబుతున్నారు.. అలాగే ఇంట్లోనే పూజ గదిలో మూడు దుర్గా విగ్రహాలు అసలు ఉంచకూడదట. అది గృహ జీవితానికి అనుకూలమైనది కాదని చెబుతున్నారు. ఇంట్లో గోమతి చక్రం ఆనందం శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే రెండు గోమతి చక్రాలు ఉంచడం అశుభకరం అని చెబుతున్నారు. శాలిగ్రామాలు విష్ణువు చిహ్నాలుగా పరిగణిస్తారు. వీటిని చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. సాధారణంగానే శాలిగ్రామం పూజ చేసుకోవాలి అంటే చాలా నిష్ట ఉండాలి. ఆడవారు నెలసరి కలుపుకునే ఇంట్లో శాలిగ్రామం ఉంచి పూజ చెయ్యడం వల్ల మేలు కంటే చెడు ఎక్కువ జరుగుతుందట. ఒక వేళ నిష్టగా పూజ చేసుకున్నా ఇంట్లో రెండు శాలి గ్రామాలు ఉంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందట.