Site icon HashtagU Telugu

Eyes: పురుషులకు కుడికన్ను, స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 23 Feb 2024 09 32 Pm 3702

Mixcollage 23 Feb 2024 09 32 Pm 3702

మామూలుగా మనకు అనేక సందర్భాలలో కళ్ళు అదరడం అన్నది సహజం. కొన్నిసార్లు కన్ను భాగంలో పైరప్ప అదిరితే కొన్నిసార్లు కింద రెప్ప అదురుతూ ఉంటుంది. కాగా పురుషులకు కుడి కన్ను అదిరితే మంచిది ఎడమ కన్ను అదిరితే మంచిది కాదని చెబుతూ ఉంటారు. అలాగే స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే మంచిది కుడి కన్ను అదరడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. నిజానికి కళ్ళు అదిరితే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి. అలా అదరడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే దరిద్రం వెంటాడుతుందని, కుడి కన్ను అదిరితే అతని చిరకాల కోరిక నెరవేరుతుందని, తనకు ఇష్టమైన వారిని కలవడం లేదంటే ఏదైనా అదృష్టం కలిసి రావడం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

అలాగే మహిళల కుడి కన్ను కొట్టుకుంటే అరిష్టంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట. మన దగ్గర ఉన్న నమ్మకాలను బట్టి అది అధారపడి ఉంటుంది. మంచి, చెడులను తెలియజేయడానికి కున్ను కొట్టుకుంటోందా? లేదంటే శరీరంలో ఏదైనా సమస్య వల్లా అనేది కూడా మనం తెలుసుకోవాలి. చైనా కంటి శాస్త్ర ప్రకారం ఎడమ కన్ను అదిరితే గొప్ప వ్యక్తి ఇంటికొస్తారని, కుడికన్ను అదిరితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని భావిస్తారు. అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కన్ను అదిరితే కంగారు పడేపనేదో జరుగుతుందని, కుడికన్ను అదిరితే ఎవరో మీ గురించి ఆలోచిస్తున్నారని, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల మధ్య సమయంలో అదిరితే అనుకున్న పనులు పూర్తికావడంతో పాటు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయనే నమ్మకం ఉంది.

మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్యలో ఎడమకన్ను అదిరితే త్వరలోనే కొంత ధనం కోల్పోతామని అర్థం. అంతేకాదు విదేశాల నుంచి అతిథులు వస్తారని, కుడి కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్న వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట లోపు కన్ను అదిరితే గొప్ప వ్యక్తిని కలుస్తారట.