Turmeric: ఆర్థిక సమస్యలు దూరం అవ్వాలంటే పసుపుతో ఈ పరిహారాలు పాటించాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా కూడా డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని అప్పుల భారంతో ఇబ్బంది

Published By: HashtagU Telugu Desk
Mixcollage 28 Jan 2024 04 51 Pm 1327

Mixcollage 28 Jan 2024 04 51 Pm 1327

ఈ రోజుల్లో చాలామంది ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా కూడా డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని అప్పుల భారంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే డబ్బులు చేతికి ఇవ్వాల్సిన వారు కూడా ఇవ్వకుండా సతాయిస్తున్నారని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు అన్ని సక్రమంగా ఉన్నా కూడా వాస్తు విషయాల వల్ల అలాగే గ్రహాల దోషాల వల్ల కూడా వారు చెడు సమయాలను చూడవలసి వస్తుంది. అయితే అటువంటివారు ఆర్థిక లాభాలు పొందడానికి, డబ్బులకు లోటు లేకుండా ఉండడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది..

అటువంటి వాటిలో పసుపుతో ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు కూడా ఒకటి. చాలామంది తమ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, ఎవరెవరినో సంప్రదించి, ఏవేవో పూజలు చేసి, ఇంటికి యంత్రాలు కట్టించి నానా తంటాలు పడుతూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో పసుపుకు చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. ఇంట్లో పసుపును ఉపయోగించడం పవిత్రమైనది. పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంత పరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇంట్లో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలామంది ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు.

ఉప్పు మాత్రమే కాదు పసుపు కూడా ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిటికెడు పసుపు నీళ్లలో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇది గ్రహాలను కూడా శాంతింప చేస్తుంది. అంతేకాదు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలని భావించేవారు ఒక చిన్న పసుపు ముద్దను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి దానిని లాకర్లో భద్రపరచాలి. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. ఇంటి ప్రవేశ ద్వారం పై పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసినట్లయితే, ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని చెబుతారు.

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం కూడ సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పసుపుతో ఈ చిట్కాలను పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇంటి ముందు పసుపు నీళ్ళు చల్లేవారు ఆ నీళ్ళలో పసుపుతో పాటు ఒక నాణెం వెయ్యాలి. నీళ్ళు చల్లటం పూర్తి అయిన తర్వాత ఆ నాణెం పూజగదిలో జాగ్రత్తగా భద్రపరచాలి. అప్పుడు ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి పసుపుతో ఈ విధమైన పరిహారాలు పాటిస్తే చాలు లక్ష్మి అనుగ్రహం కలగడంతో పాటు ఆర్థిక సమస్యలు దూరమై మీకు అదృష్ట యోగం పడుతుంది.

  Last Updated: 28 Jan 2024, 04:52 PM IST