Site icon HashtagU Telugu

Tulsi: తులసి వివాహం రోజున ఏం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో తెలుసా?

Tulsi

Tulsi

హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని విశేషమైన రోజుల్లో విశేష పూజలు చేస్తుంటారు. తులసి దేవిని పూజించడం వల్ల విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భక్తులు భావిస్తారు. తులసి. ఇకపోతే ప్రతి ఏడాది కార్తీక మాసంలో తులసి వివాహాన్ని జపిస్తూ ఉంటారు. అలాగే ఏడాది కూడా నవంబర్ 12వ తేదీన తులసి వివాహాన్ని జరిపించనున్నారు. మంగళవారం రోజు సాయంత్రం మూడు గంటల తర్వాత తులసి వివాహాన్ని జరిపించడం వల్ల అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.

తులసి వివాహం జరిపించడం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. మరి ఈరోజు తులసి దేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కార్తీక మాసంలో ఏకాదశి రోజున విష్టుభగవానుడు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. ఆ మరుసటి రోజే అంటే ద్వాదశి రోజు సాలగ్రామ అవతారంలో తులసి వివాహం చేసుకుంటాడు. అప్పటి నుండి సాలగ్రామ రూపంలో ఉన్న విష్టుమూర్తికి తులసికి వివాహం జరపడం ఆనవాయితీగా వస్తోంది. తులసి వివాహం జరపడానికి ఏకాదశి తిథిరోజు అన్ని పండుగల మాదిరిగానే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి.

రోజంతా శుచిగా ఉండాలి. సాయంత్రం సమయంలో మాత్రమే తులసి వివాహం జరుపుతారు కాబ్టటి అందుకోసం కావలసిన సామాగ్రి సిద్దం చేసుకోవాలి. తులసి వివాహాన్ని విష్ణువుకు మరో రూపం అయిన శాలి గ్రామంతో జరుపుతారు. ఇందుకోసం విష్ణువు శాలిగ్రామాన్ని తులసి చెట్టుకు కట్టాలి. తరువాత గంగాజలం చల్లాలి. తులసి చెట్టు ముందు నీటితో నింపిన పాత్ర ఉంచి అందులో నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్క ఏర్పాటు చేసిన కుండీలో చెరకు మండపాన్ని ఏర్పాటు చేయాలి. తులసి, శాలి గ్రామాలకు చందనాన్ని రాసి తిలకం దిద్దాలి. తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసమ్మకు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి.

చేతికి కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకున్న చేతిలో శాలి గ్రామాన్ని పట్టుకుని తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తరువాత కర్పూర హారతి ఇవ్వాలి. తులసి వివాహం జరిపేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి తీరాలి. పూజ తరువాత మాత్రమే ప్రసాదం స్వీకరించాలని పండితులు చెబుతున్నారు.