Tulsi Plant: కార్తీకమాసం వచ్చింది అంటే చాలు ఇంట్లో గుళ్ళలో ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఇళ్లలో ఆలయాల వద్ద కార్తీకదీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయని నమ్మకం. ఈ సమయంలో విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి మొక్క కు కొన్ని పూజలు చేస్తే చాలు, దేవతల ఆశీస్సులతో మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది అనగా 2025లో కార్తీక మాసం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
ఈ నెలంతా శ్రీ మహా విష్ణువు, శ్రీ కృష్ణుడి ఆరాధనకే అంకితం చేయాలని మనలోని చెడును వదిలించుకుని, భక్తి మార్గంలో నడవడానికి ఇది సరైన సమయం అని పండితులు చెబుతున్నారు.తులసి మొక్క విషయానికొస్తే తులసి సాక్షాత్తుగా లక్ష్మీ దేవి స్వరూపం. అందుకే ఆమెకు అత్యంత ఇష్టమైన ఈ కార్తీక మాసంలో తులసిని మనస్ఫూర్తిగా పూజిస్తే, ఆ ఇంట్లో సంతోషానికి, ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి లోటు ఉండదని చెబుతున్నారు. కార్తీక మాసంలో మీ ఇంట్లో సంపద పెరగాలంటే, కొన్ని పవిత్రమైన వస్తువులను తులసి మొక్క దగ్గర ఉంచి, చిన్న చిన్న పూజలు చేయాలని చెబుతున్నారు.
గోమతి చక్రం.. కాగా గోమతి నదిలో లభించే ఈ పవిత్రమైన వస్తువును శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరి స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో కొన్ని గోమతి చక్రాలను తులసి మొక్క దగ్గర ఉంచితే, ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత, స్థిరత్వం లభిస్తాయని నమ్మకం. కార్తీక మాసంలో అస్సలు మిస్ చేయకూడని ముఖ్యమైన నియమం ఇది. రోజూ సాయంత్రం వేళ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తులసి కోట దగ్గర దీపం వెలిగించాలట. ఆ దీపం కాంతి మనలోని అజ్ఞానాన్ని పోగొడుతుందని, ఇది విష్ణుమూర్తిని, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేస్తుందని, వారి ఆశీస్సులు లభిస్తే, డబ్బుకు అస్సలు లోటు ఉండదని చెబుతున్నారు. కాబట్టి కార్తీక మాసంలో తులసి కోట వద్ద నెయ్యితో దీపారాధన చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలాగే తులసి దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు పండితులు.
పసుపు కొమ్ముపసుపు శుభానికి, అదృష్టానికి చిహ్నం. విరగని పసుపు కొమ్మును తులసి మొక్క మొదట్లో ఉంచడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిపోయి, డబ్బు నిలిచే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుందట. అలాగే కార్తీక మాసంలో ఉండాల్సిన వస్తువులలో సాలగ్రామం కూడా ఒకటి. ఇది మనకు పూజ స్టోర్ లో లభిస్తూ ఉంటుంది. ఈ సాలగ్రామం అన్నది సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువుకు గుర్తు. తులసి మొక్క దగ్గర సాలగ్రామాన్ని ఉంచడం చాలా శుభప్రదం. ఇది విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల పవిత్ర బంధానికి ప్రతీకగా చెబుతున్నారు. ఇలా చేస్తే వారిద్దరి పూర్తి అనుగ్రహంతో ఆ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుందట. ఈ వస్తువులను పెట్టడమే కాదు, ఈ నెలంతా కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. అవేంటంటే, రోజూ ఉదయం స్నానం చేశాక, తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి. ఇది ఇంట్లోకి సంతోషాన్ని, సంపదను తెస్తుందట. అయితే ఆదివారం రోజున తులసికి నీరు పోయకూడదట.
Tulsi Plant: కార్తీక మాసంలో తులసి మాతకు ఈ విధంగా పూజ చేస్తే చాలు.. విష్ణు అనుగ్రహంతో ధన ప్రవాహమే పెరగడం ఖాయం!

Tulsi Plant