Tusli plant tips: తులసి మొక్క విషయంలో ఆ విషయాలు పాటిస్తే చాలు.. డబ్బే డబ్బు?

హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. విశేషమైన రోజుల్లో తులసికి ప్రత్యేకంగా పూజలు కూడా చే

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 08:30 PM IST

హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతోపాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. విశేషమైన రోజుల్లో తులసికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్క విషయంలో ఎన్నో రకాల విషయాలను పాటిస్తూ ఉంటారు. తులసి మొక్కలు లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని కాబట్టి తులసిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీ విష్ణువు తులసి ముగ్గురి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. తులసి మొక్కలు పూజలు చేయడం వల్ల ఆ ఇంట సుఖ శాంతులు కలుగుతాయని నమ్మకం. తులసి మొక్కకు రోజూ క్రమం తప్పకుండా పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి సదా కొలవుదీరుతుందని అంటారు.

లక్ష్మీదేవి ప్రసన్నమై కటాక్షం కురిపిస్తుందని ప్రతీతి. లక్ష్మీదేవి కటాక్షం కారణంగా ఆ ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయి. అయితే తులసి మొక్కను ఏ దిశలో అమర్చుకోవాలి, ఎలా పూజలు చేయాలనేది వాస్తు శాస్త్రంలో వివరంగా ఉంది. ఏ దిశలో పడితే ఆ దిశలో తులసి మొక్కను ఉంచకూడదు. సహజంగానే వాస్తు శాస్త్రమంటే దిశల్ని బట్టి ఉంటుంది. సరైన దిశలో ఉంటేనే ఏ వస్తువైనా పాజిటివ్ ఫలితాలని ఇస్తుందని అంటారు. తులసి మొక్క అనేది ఇంట్లో నెగెటివిటీని దూరం చేస్తుంది. అదే తులసి మొక్కను ఇంట్లో తప్పుడు దిశలో ఉంచితే ఆ ఇంట్లో సమస్యలు ఎదురౌతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలో పొరపాటున కూడా అమర్చకూడదు.

దీనివల్ల వాస్తుదోషం తలెత్తుతుంది. ఆ వ్యక్తి జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. తులసి మొక్క నాటేందుకు ఇంటి నార్త్ ఈస్ట్ లేదా నార్త్ అనేది సరైన దిశగా వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంట్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు ఉంటే తొలగిపోతాయి. ఇంట్లో తులసి మొక్క పెంచుతుంటే కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ప్రత్యేకించి కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావల్సి ఉంటుంది. ఆ వ్యక్తి ఆర్ధికంగా పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఆదివారం రోజున, ఏకాదశి రోజున పొరపాటు కూడా తులసి ఆకు తెంచకూడదు. సాయంత్రం తరువాత కూడా తులసి ఆకులు తెంపకూడదు. రాత్రి వేళ తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఒకవేళ ఈ సూచనల్ని ఉల్లంఘిస్తే ఆ వ్యక్తి జీవితంలో ప్రతి అంశంలో ఆటంకాలు ఎదురౌతాయి. తులసి నియమాల్ని పాటించడం వల్ల ప్రతికూల పరిణామాల్నించి తప్పించుకోవచ్చు. అందుకే తులసి మొక్క విషయంలో వాస్తు సూచనలు తప్పకుండా పాటించాలి.