ఆర్థికమైన ఇబ్బందులతో ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి ఈ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే ఎంత సంపాదించినా కూడా చేతిలో మిగలకపోగా అప్పులు చేయాల్సి వస్తోందని చేతిలో డబ్బులు మిగలడం లేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఇలా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు, ఆ సమస్యల నుంచి బయటపడడం కోసం పూజలు పరిహారాలు దానధర్మాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా ఆర్థిక సమస్యలు మాత్రం తీరవు.
కాగా డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండకూడదు, డబ్బులు చేతిలో నిలవాలి ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీ అనుగ్రహం కలగడం తప్పనిసరి. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కొన్ని రకాల పూజలు చేయడం తప్పనిసరి అని చెబుతున్నారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారు గురువారం రోజు ఇప్పుడు చెప్పినట్టు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ గురువారం రోజు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. గురువారం రోజు ఉదయం నిద్ర లేచి స్నానం చేసి తులసి మొక్కకు పూజించాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి తులసి మొక్కను పూజించడం వల్ల ఆ విష్ణు దేవుని అనుగ్రహం కూడా మన పైన ఉంటుందట.
ఇకపోతే గురువారం తలంటూ స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలట. ఇలా ఈ దుస్తులను ధరించి తులసి మొక్కకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి తులసి మొక్కకు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించాలట. ఇలా ఉదయం పూజ చేసి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించిన తర్వాత అలాగే సాయంత్రం నెయ్యితో దీపారాధన చేయాలట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణు దేవుడి అనుగ్రహం కూడా మన పైనే ఉంటుందట. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక గురువారం రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం కూడా శుభపరిణామం అని చెబుతున్నారు. అలాగే గురువారం అరటి మొక్కలకు నీటిని సమర్పించడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట.