మామూలుగా మనం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అటువంటి వాటిలో తులసి మొక్క కూడా ఒకటి. ఇంట్లో ఎలాంటి చెట్టు ఉన్నా లేకపోయినా తులసి మొక్క మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. హిందువుల ఇండ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో పాటు శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్క హిందువు ఇంటి ఆవరణలో తెలిసి మొక్కలు తప్పకుండా పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. అయితే తులసి మొక్కతో పాటు చాలామంది ఇంటి ఆవరణలో చాలా రకాల మొక్కలు పెట్టుకుని పూజలు కూడా చేస్తూ ఉంటారు.
వాటిలో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. ఈ ముక్క ఏంటి వద్ద అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవని, ఆర్థికంగా కూడా మంచి లాభాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఈ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయంలో చాలామందికి సందేహాలు కలిగే ఉంటాయి. ఈ రెండు మొక్కలు పక్కపక్కనే ఉండవచ్చా ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను నాటవచ్చు. ఇలా చేయడం వల్ల పేదరికం తొలగి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందట. అలాగే ఈ దిశలో మనీ ప్లాంట్ ను నాటడం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తులు ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటాయట.
వాస్తు శాస్త్రంలో తులసి మొక్కను ఇంటి ఉత్తరం, ఈశాన్య, తూర్పు దిశలు ఉత్తమంగా పరిగణించబడతాయి. దీనితో పాటు, తులసి మొక్కను పూజా స్థలంలో లేదా వంటగది దగ్గర కూడా ఉంచవచ్చట. అయితే మహిళల నెలసరి సమయంలో వంటగది, పూజ గదిలోకి పోకుండా ఉండేలా అయితేనే ఇలా పెంచుకోవాలని చెబుతున్నారు. ఈ రకమైన జాగ్రత్తలు పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందట. తులసి మొక్క ఉన్నవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కను పూజించాలని చెబుతున్నారు. తులసి, మనీ ప్లాంట్, రెండూ సానుకూల శక్తిని ప్రోత్సహించే మొక్కలు. ఇంట్లో తులసి మొక్కను, మనీ ప్లాంట్ ను కలిపి ఉంచితే పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుందట. ఇది కాకుండా ప్రతికూల శక్తి ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటుందట. అయితే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్, తులసి చుట్టూ ముళ్ల మొక్కలను ఎప్పుడూ నాటకూడదు. దీని కారణంగా ఈ మొక్కల యొక్క సానుకూల ప్రభావాలు తగ్గుతాయట. మొక్కలను పెంచినా ఇంట్లో సానుకూల ఫలితాలు ఉండవని పండితులు చెబుతున్నారు.