మామూలుగా చాలామంది వారికి ఇష్టమైన దేవుడి అనుగ్రహం కలగాలని ఏవేవో పూజలు పరిహారాలు దానధర్మాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు ఇలాంటి ఫలితం రాలేదని దిగులు చెందుతూ ఉంటారు. మనలో చాలామంది ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని ఆయన అనుగ్రహం కలిగితే ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతుంటారు. మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. ఈ రోజున హనుమాన్ ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.
ప్రతి మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్లాలి. ఆయన కుడి భుజానికి కుంకుమ తిలకం పూయాలట. అయితే కొన్ని ఆలయాల్లో గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. అలాంటప్పుడు పండితుల చేత ఆ కుంకుమను స్వామి వారి కుడి భుజానికి పూయమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ తొలగిపోవడంతో పాటు మీరు చేపట్టిన పనులు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. దీనితో పాటు మల్లె నూనెలో కుంకుమ పువ్వును కలిపి మంగళవారం భజరంగబలికి సమర్పించాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని బాధలు, దుఃఖాలు తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారం నాడు రుణాన్ని తిరిగి చెల్లిస్తే జీవితంలో మీరు మళ్లీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండదని నమ్ముతారు.
ఇందుకోసం మీరు మంగళవారం నాడు హనుమంతుడి ఆలయానికి వెళ్లి బజరంగబలికి గులాబీ పూలతో చేసిన మాలను సమర్పించాలట. ఇలా వరుసగా 7 మంగళవారాలు చేయాలి. ఈ పరిహారంతో మీకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చట. అలాగే మంగళవారం రోజు హనుమంతుడిని పూజించేవారు మాంసాన్ని తినకూడదట. మందు తాగకూడదట. ఎవరితో వాదించడం కలహాలకు పోవడం లాంటివి అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఈ రోజున స్వామి వారిని స్మరిస్తూ ఉండడంతో పాటుగా మీ పని మీరు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా మంగళవారం రోజు గోర్లు కత్తించడం జుట్టు కత్తిరించడం లాంటివి అసలు చేయకూడదట.