హనుమంతుడిని కొంతమంది మంగళవారం రోజు పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు. కానీ మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రోజుగా భావించాలి. ఈ రోజున ఆయనను పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు కలుగుతాయట. అలాగే ఆయన అనుగ్రహం కలగాలి అనుకున్న వారు మంగళవారం రోజు తప్పకుండా కొన్ని రకాల పరిహారాలను పాటించాలని చెబుతున్నారు. అలాగే మంగళవారం నాడు హనుమంతుడని ఆరాధించడం వలన కుటుంబంలో సంతోషాలు కలుగుతాయి. ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజు తమలపాకులతో లేదా సింధూరంతో పూజించడం వలన కోరికలు నెరవేరుతాయట. హనుమంతుడుకి సింధూర పూజ ప్రధానం. హనుమంతుడు అనుగ్రహం కలగాలంటే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆంజనేయ స్వామికి సమర్పించాలి. అలా చేస్తే హనుమంతుడి అనుగ్రహం తప్పక కలుగుతుందట. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం మంగళవారం రోజు తలస్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, హనుమంతుడు ఆలయానికి వెళ్లి సింధూరాన్ని సమర్పించాలట. ఆ తర్వాత హనుమంతుడి ఎదుట హనుమాన్ చాలీసా చదువుకోవాలట. ఇలా ఐదు మంగళవారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈజీగా బయటపడవచ్చని చెబుతున్నారు.
కష్టాల నుంచి బయట పడడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వారు.. జీవితంలో సక్సెస్ ని అందుకోవాలంటే ఈ పరిహారాన్ని పాటించవచ్చు. హనుమంతుడికి సింధూరం సమర్పించిన తరవాత, ఆ సింధూరాన్ని మీరు మీ నుదుటన పెట్టుకుంటే, మీరు పడే కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందట. హనుమంతుని పూజించడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రమే కాకుండా శనికి సంబంధించిన సమస్యలు కూడా దరిదాపుల్లోకి రావని చెబుతున్నారు.