హిందూమతంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మంగళవారం రోజున హనుమంతుడిని ఆరాధించడం వలన జీవితంలోని ఇబ్బందులు తొలగిపోతాయట. కష్టాలు కూడా పరిష్కారమవుతాయని చెబుతున్నారు. అలాగే ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన కొన్ని చర్యలు ఫలవంతంగా ఉంటాయట. వీటిని పాటించడం వలన అన్ని కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు.
మంగళవారం రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియమం ఉంది. ఈ నివారణలు లేదా ఉపాయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి కోరుకున్న ఫలితాలను పొందవచ్చట. అలాగే అన్ని పనుల్లో విజయం సాధించవచ్చని చెబుతున్నారు. మరి మంగళవారం రోజు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మంగళవారం రోజు హనుమంతుడిని పూజించి తమలపాకులు నైవేద్యంగా సమర్పించాలట. ఈ పరిహారం చేయడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నెరవేరతాయని, విజయాన్ని పొందవచ్చని చెబుతున్నారు. అలాగే ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. కుజుడు జాతకంలో మొదటి, రెండవ, నాల్గవ, సప్తమ, ఎనిమిది, పన్నెండవ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తికీ కుజ దోషం ఉన్నట్లే అని చెబుతున్నారు. మంగళ దోష ప్రభావం తగ్గాలి అనుకున్న వారు మంగళవారం రోజు ఎండుమిర్చి దానం చేయాలట.
అలాగే మంగళవారం రోజు హనుమంతుడి అనుగ్రహం కలగాలి అంటే సీతారాములతో పాటు హనుమంతుడిని కూడా పూజించాలని చెబుతున్నారు. అలాగే కోరిన కోరికలు నెరవేరడం కోసం స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆ తర్వాత హనుమంతుడిని పూజించాలని చెబుతున్నారు. పూజ సమయంలో ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పండ్లు, పువ్వులు సమర్పించాలట. తరచుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే. ఓం హన్ హనుమతే నమః అనే మంత్రాని పట్టించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయట.