Site icon HashtagU Telugu

Hanuman Puja: మంగళవారం రోజు హనుమాన్ పూజలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే?

Lord Hanuman

Hanuman Puja

హిందూ ధర్మంలో వారంలో ఒకొక్క రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అలా మంగళవారం హనుమంతుడి అంకితం చేయబడింది. కాబట్టి మంగళవారం రోజున ఆంజనేయస్వామి ఎవరైతే భక్తిశ్రద్ధలతో పూజిస్తారో, వారికి ఆయన అనుగ్రహం తప్ప కలుగుతుంది. స్వామివారికి ఇష్టమైన వాటితో పూజ చేయడం వల్ల కోరిన కోరికలు తీరడంతో పాటు ఆయన మన వెంట ఉండి మనకు ధైర్యాన్ని ఇస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామికి పూజ చేయడం మంచిదే కానీ పూజ చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అంటున్నారు పండితులు.

మరి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హనుమంతుడు శ్రీరాముడి భక్తుడు. బ్రహ్మచారి కూడా. కలియుగం దైవంగా పురాణ గ్రంధాలలో వర్ణించబడ్డాడు. మంగళవారం హనుమంతుడిని పూజించిన భక్తులు పొరపాటున మాంసం తినరాదు. మద్యం లేదా మత్తు పదార్థాలను సేవించకూడదు. అలాగే మంగళవారం హనుమంతుడితో పాటు శ్రీరాముడిని కూడా పూజిస్తారు. ఈ రోజున బజరంగ బలిని పూజించడం వల్ల మంగళ దోషం తొలగిపోతుంది. ఈ రోజున భక్తులు ఎవరినీ అవమానించకూడదు.

మరీ ముఖ్యంగా బిచ్చగాళ్లు, పేదలు, అనారోగ్యం, వికలాంగులు లేదా వృద్ధులను అవమానించడం చిన్నచూపు చేసే మాట్లాడడం లాంటివి చేయకూడదు. హనుమాన్ పూజ అంగారకుడి చెడు దృష్టిని తొలగిస్తుంది. శ్రీరామచంద్రుడిని, హనుమంతుడిని పూజించడంతో పాటు శివుడిని కూడా మంగళవారం పూజించాలి. ఈ రోజున భక్తుడు శివుని పూజించకపోయినా, అవమానించకూడదు. శివుడిని తక్కువగా చూసే భక్తుల పట్ల హనుమాన్ కు కోపం వస్తుందట. సమస్యల సుడిగుండంలో చిక్కుంటారట. హనుమంతుని భక్తులు మంగళవారం బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు తల్లి, సోదరి, కుమార్తె , భార్యతో పాటు ఇతర స్త్రీలను కూడా దైవ స్వరూపంగా భావించాలి. గౌరవించాలి.