Tuesday: వారంలో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు అంకితం చేయబడింది. ఒక్కో రోజు ఒక్కో దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలా మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. మంగళవారం రోజు హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే హనుమంతుడిని పూజించడం మంచిదే కానీ కొన్ని రకాల తప్పులు అసలు చేయకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మంగళవారం ఉదయం స్నానం చేసిన తరువాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించాలట. తర్వాత హనుమంతుని ఆలయానికి వెళ్లి సింధూరం, బెల్లం , శనగలు నైవేద్యంగా సమర్పించాలట. ఇంట్లో అయితే దీపం వెలిగించి ఆంజనేయుడికి ఎర్రటి పూలతో పూజచేసి నైవేద్యం సమర్పించాలని, ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠించాలని చెబుతున్నారు. అదేవిధంగా మంగళవారం నాడు మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి తినకూడదని చెబుతున్నారు. ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలట.
శుద్ధమైన ఆహారం మనస్సును శాంతింపజేస్తుందని,ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని చెబుతున్నారు. కాగా మంగళవారం వ్రతం ఆచరించడం వల్ల మంగళ గ్రహ దోషాలు తొలగిపోతాయనట. జీవితంలో విజయం లభిస్తుందని చెబుతున్నారు. వ్రతం చేసే వ్యక్తి రోజులో ఒకసారి మాత్రమే ఫలాహారం లేదా తేలికపాటి భోజనం చేయాలట. వ్రతం సమయంలో హనుమంతుని నామం జపిస్తూ ఉండాలని, దీనివల్ల ఇంట్లో సుఖశాంతి నెలకొంటుందట. మంగళవారం నాడు శివుడిని పూజించడం కూడా శుభప్రదంగా భావిస్తారట. శివలింగానికి నీరు, పాలు, చందనంతో అభిషేకం చేయాలట. గుడిలో నూనె లేదా సింధూరం సమర్పించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలట. పూజ సమయంలో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేసి హారతి ఇవ్వాలని చెబుతున్నారు.
Tuesday: మంగళవారం రోజు హనుమంతుడిని పూజిస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి!

Tuesday Hanuman