TTD vs Karnataka: టీటీడీ vs కర్ణాటక ఆంజనేయ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ : హనుమంతుడు ఎక్కడ జన్మించాడు?

శ్రీరాముడి భక్తుడు హనుమంతుడి జన్మస్థలంపై వివాదం ఇంకా పరిష్కరించబడలేదు. దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక లేదా ఆంధ్రప్రదేశ్‌ లో హనుమంతుడు జన్మించి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.

TTD vs Karnataka : ఈరోజు హనుమాన్ జయంతి. అయోధ్యలో రామ మందిరం పని సగం పూర్తయింది. 2024 అంటే వచ్చే ఏడాది భక్తుల కోసం అయోధ్య రామ మందిరం తెరవబడుతుంది. అయితే శ్రీరాముడి భక్తుడు హనుమంతుడి జన్మస్థలంపై వివాదం ఇంకా పరిష్కరించబడలేదు. దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక లేదా ఆంధ్రప్రదేశ్‌ లో హనుమంతుడు జన్మించి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. హనుమంతుడు తిరుమలలోని 7 కొండల్లో ఒకదానిపై జన్మించారని ఆంధ్రప్రదేశ్ కు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వాదిస్తోంది.కర్ణాటకలో శ్రీ ఆంజనేయ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఉంది.హంపికి 25 కి.మీ దూరంలో ఉన్న అనెగుండి గ్రామమే రామాయణ కాలం నాటి కిష్కింధ నగరమని, హనుమాన్ ఇక్కడే పుట్టారని ఆ ట్రస్ట్ వాదిస్తోంది.

తిరుమలలోని ఆంజనేయ కొండపై ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం నిర్మించే భవన సముదాయానికి TTD భూమిపూజ కూడా చేసింది. అయితే కర్ణాటకలోని శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన గోవిందానంద సరస్వతి ఈ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై గతేడాది కోర్టు స్టే విధించగా, అది ఇప్పటికీ అమలులో ఉంది.

ఈనేపథ్యంలో 2020 లో TTD 7 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. హనుమాన్ జీ జన్మస్థలం తిరుమల అని నిరూపించడానికి ఇది ప్రయత్నించింది. ఈ కమిటీ రూపొందించిన నివేదికను, దానికి సంబంధించిన ఆధారాలను తెలుగు, ఇంగ్లిష్ తోపాటు హిందీలోనూ ప్రచురించినా కర్ణాటకకు చెందిన శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అంగీకరించలేదు. హనుమాన్ జీ జన్మస్థలానికి సంబంధించి ఇరు వర్గాల వాదనలు, రుజువులు భిన్నంగా ఉన్నాయి.ఇటీవల ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధులు శ్రీరాముడు అరణ్యవాసం చేసిన స్థలాలను ఒకచోట చేర్చి నివేదికను రాసిన పరిశోధకుడు డాక్టర్ రామ్ అవతార్‌ ను కలిసి మాట్లాడారు. దీనిపై ఆయనతో మాట్లాడింది.

మీడియా సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం..

కిష్కింధ ఉన్న హంపిలో..

“రామానంద్ సంప్రదాయానికి చెందిన మహంత్ విద్యాదాస్ గత 26 సంవత్సరాలుగా హంపిలో పూజా బాధ్యతలను నిర్వహి స్తున్నారు.  హనుమాన్ జీ జన్మస్థలం గురించి అడిగినప్పుడు ఆయన చాలా రుజువులను మాకు ఇచ్చాడు… వాస్తవాలను లోతుగా త్రవ్వడానికి, మేము 20 సంవత్సరాలకు పైగా హంపి మరియు కిష్కింధలో చరిత్రకారుడు, పురావస్తు శాస్త్రవేత్త , పరిశోధకుడైన డాక్టర్ శరణబసప్ప కోల్కర్‌ను సంప్రదించాము.వారు కన్నడలో సంభాషించుకుంటారు. కాబట్టి మేము మాతో ఒక ద్విభాష నిపుణుడిని తీసుకెళ్ళాం.. డాక్టర్ కోల్కర్ ప్రకారం హనుమాన్ జీ జన్మస్థలం కర్ణాటకలోని హంపికి సమీపంలో ఉన్న కిష్కింధ.” అని మీడియా సంస్థ నివేదిక పేర్కొంది.

తిరుపతిలో..

”హనుమంతుని జన్మస్థలానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన కమిటీలోని ఏడుగురు సభ్యులలో ఒకరితోనూ, తిరుపతిలోని జాతీయ సంస్కృత పాఠశాలలో ప్రొఫెసర్ సదాశివమూర్తితోనూ వివరంగా మాట్లాడాం. హనుమంతుని జన్మస్థలానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు, శ్రీ వేంకటేశ్వర హయ్యర్ థియోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ్ శర్మను కలిశాం. ఆయన అనేక రుజువులు కూడా ఇచ్చాడు” అని మీడియా సంస్థ నివేదిక పేర్కొంది.

డాక్టర్ రామ్ అవతార్ ఏమన్నారు?

పరిశోధకుడు డాక్టర్ రామ్ అవతార్ మాట్లాడుతూ..హంపిని హనుమంతుని జన్మస్థలంగా నేను భావిస్తున్నాను. వాల్మీకి రామాయణంలోని కిష్కింధ కాండ్‌లో, 12వ అధ్యాయంలో మాతంగ్ వనాన్ని ప్రస్తావించారు. అది తిరుమలలో కాకుండా కిష్కింధలో మాత్రమే ఉంది. అతను మాతంగ్ అడవిలో ఆడుకునే వాడని పేర్కొన్నారు.అయితే ఏపీ, కర్ణాటక రాష్ట్రాల వారి స్వంత వాదనలు, నమ్మకాలు , ఆధారాలు ఉన్నాయి. హంపికి సమీపంలోని కిష్కింధ అంజనీ కుమారుడైన హనుమంతుని జన్మస్థలమని సహజ ఆధారాలు సూచిస్తున్నప్పటికీ, ఒక నిర్ధారణకు రావడం కష్టం. అంజనాద్రి పర్వతంపై టీటీడీ నిర్మాణ పనుల వ్యవహారం హైకోర్టులో ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

రూ.120 కోట్లు..

హనుమాన్ జన్మస్థలం అభివృద్ధికి రూ.120 కోట్లు కేటాయించామని గంగావటిలో నివసిస్తున్న ఆర్ఎస్ఎస్ నాయకుడు సంతోష్ చెబుతున్నారు. భూసేకరణ పనులు కూడా ప్రారంభమ య్యాయని చెప్పారు..

హనుమంతుని జన్మస్థలం దావా చేసే ప్రాంతాల లిస్ట్..

  1. హనుమాన్ జీ గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో ఉన్న అంజనీ పర్వత గుహలో జన్మించాడని నమ్ముతారు.
  2. అంజన్ గ్రామం జార్ఖండ్‌లోని గుమ్లా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పర్వతం మీద ఉన్న గుహలో హనుమంతుడు జన్మించాడని నమ్ముతారు.
  3. హర్యానాలో ఉన్న కైతాల్ వానర్ రాజ్ హనుమాన్ జన్మస్థలంగా పరిగణించబడుతుంది.
  4. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి 28 కి.మీ దూరంలో ఉన్న అంజనేరి దేవాలయం హనుమాన్ జీ జన్మస్థలమని నమ్ముతారు.
  5. హనుమంతుడు ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణలో జన్మించాడని కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఒక మఠాధిపతి పేర్కొన్నారు.

Also Read:  Hanuman Jayanti April 6th, 2023: ఏప్రిల్ 6, 2023 హనుమాన్ జయంతి