Tirumala Tirupati Devasthanam: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 11న టికెట్లు విడుదల..!

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే.

Published By: HashtagU Telugu Desk
Srivari Darshan Tickets Ttd

Srivari Darshan Tickets Ttd

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. డిసెంబర్ నెలకుగాను నవంబర్ 11న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి టీటీడీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ నెల రూ.300 టికెట్లను ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. 11వ తేదీన ఉదయం 10 గంటలకు TTD వెబ్‌సైట్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

భక్తులు https://online.tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. టీటీడీ ఆన్ లైన్ టిక్కెట్లు కావాలంటే https://online.tirupatibalaji.ap.gov.in/ సైట్ లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇందు కోసం సైట్ లో సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మెయిల్ ఐడీ, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎంచుకోవాలి.

అలాగే కన్ఫర్మేషన్ కోసం మొబైల్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. వెంటనే మన డిజిటల్ ఫొటో అప్ లోడ్ చేయాలి. ఐడీ కార్డలు వివరాలు ఇవ్వాలి. అంతా పూర్తయ్యాక మెయిల్ కు యాక్టివేషన్ లింకు వస్తుంది. అది క్లిక్ చేస్తే అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అక్కడి నుంచి లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ కాగానే ఏఏ సేవలున్నాయో చూపిస్తూ డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన సేవలను, మనకు కావాల్సిన తేదీల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. అందులో ఖాళీలు ఉంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఎన్ని ఖాళీలున్నాయో చూపిస్తుంది. అన్ని నిండిపోతే రెడ్ కలర్ చూపిస్తుంది. కోరుకున్న తేదీన కావాల్సిన సేవ ఉంటే అక్కడ చూపించిన టిక్కెట్ మొత్తం చెల్లిస్తే బుక్ అవుతుంది.

 

 

 

 

 

  Last Updated: 09 Nov 2022, 06:04 PM IST