Site icon HashtagU Telugu

Arjitha Seva Tickets: శ్రీవారి ఆర్జిత సేవలకు రేపటి నుంచే బుకింగ్.. లక్కీ డిప్ ద్వారా టికెట్లు..!

Ttd

Ttd

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (Arjitha Seva Tickets) ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభించి శుక్రవారం (10వ తేదీ) ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని వివరించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఈ తేదీలకు సంబంధించిన ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లను ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టిటిడి తెలిపింది. అనంతరం ఈ టిక్కెట్లను లక్కీ డిప్ ద్వారా భక్తులకు కేటాయిస్తారు.

Also Read: TSRTC : శ్రీశైలానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ప్రారంభించ‌నున్న టీఎస్ఆర్టీసీ

ఈ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ఈ నెల 22 నుంచి 28 తేదీ వరకు ఆయా సేవల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని వివరించింది. వీటితో పాటు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవలకు సంబంధించిన దర్శన్ కోటా టిక్కెట్లను ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. శ్రీవారి ఆర్జిత సేవను ఆన్‌లైన్‌లో https://ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది.