Site icon HashtagU Telugu

Srivari Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Tirumala Brahmotsavams

Tirumala Brahmotsavams

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రణాళిక బద్ధంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సి.వి.యస్ఓ నరశింహ కిషోర్ తో కలిసి జిల్లా ఎస్పి పరిశిలించారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ జిల్లా ఎస్పీ తెలిపారు. కోవిడ్ కారణంగా, రెండు సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్న అంచనాతో, భక్తులు రద్దికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గరుడసేవ రోజు ట్రాఫిక్ కు అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు పై దృష్టి సారించామన్నారు.

Pic: File Photo