TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!

తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గొప్ప శుభవార్త చెప్పింది. నడక దారిలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు ఇస్తునట్లు తెలిపింది.

TTD : తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గొప్ప శుభవార్త చెప్పింది. నడక దారిలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు ఇస్తునట్లు తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ప్రతి రోజూ 10 వేల టోకెన్లు జారీ చేస్తూన్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు తిరుమలలో వేసవి ఏర్పాట్లపై సుబ్బారెడ్డి సమీక్షించారు. నడక దారిలోనే టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వేసవిలో బ్రేక్ సిఫారసు లేఖలను తగ్గిస్తామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD తెలిపింది.

కరోనాకు ముందు నుంచీ దివ్య దర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. ఈ టికెట్లను పునరుద్ధరించాలంటూ చాలా రోజులుగా డిమాండ్లు వస్తున్న క్రమంలో నడిచి వచ్చే వారికి, వాహనాల్లో వచ్చే వారికి ఒకే క్యూలైన్ కేటాయించడంపై విమర్శలు రావడంతో మెట్లు ఎక్కి వచ్చే వారికి టోకెన్లు జారీచేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Also Read:  Create your Avatar in WhatsApp: వాట్సాప్‌లో అవతార్‌ను ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ప్రొఫైల్ పిక్ లా ఎలా ఉపయోగించాలి?