గత కొద్దీ రోజులుగా తిరుమల పుణ్యక్షేత్రం (Tirumala Temple ) వివాదంలో కొనసాగుతుంది. మొన్నటి వరకు భక్తుల రద్దీ , హుండీ ఆదాయం వంటి విషయాలు వైరల్ అవుతుండగా…ఇక ఇప్పుడు లడ్డు ప్రసాదం (Laddu) ఫై ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో లడ్డు ప్రసాదం లో కల్తీ జరిగిందని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడం తో దేశ వ్యాప్తంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రీసెంట్ గా సుప్రీం కోర్ట్..దీనిపై ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగానే తాజాగా తిరుమల అన్నప్రసాదంలో జెర్రి (Jerry) కనిపించిందంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఈ ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారని పేర్కొంది. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమే గా భావించాల్సి వస్తుందని చెప్పింది. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తూ..ఓ ప్రకటనను విడుదల చేసింది.
Read Also : Asaduddin Owaisi : యతి నర్సింహానంద్‌ను వెంటనే అరెస్టు చేయాలి.. అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్