Site icon HashtagU Telugu

TTD Exchange Rs 2000 Notes: రూ.3.2 కోట్ల విలువైన రూ.2,000 నోట్లను మార్చిన‌ టీటీడీ

TTD Exchange Rs 2000 Notes

Ttd Will Release The Quota Of Arjita Seva Tickets Online

TTD Exchange Rs 2000 Notes: తిరుమలలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం రూ.3.2 కోట్ల విలువైన రూ. 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో విజయవంతంగా (TTD Exchange Rs 2000 Notes) మార్చుకుంది. గురువారం అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అక్టోబర్ 7, 2023 నుండి రూ. 2,000 నోట్ల మార్పిడిని నిలిపివేయాలని RBI నిర్ణయం తీసుకున్న తర్వాత టీటీడీ రూ. 2 వేల నోట్ల‌ మార్పిడి ప్రక్రియ ఐదు దశల్లో జరిగింది. అక్టోబర్ 8, 2023 నుండి మార్చి 22, 2024 వరకు కొనసాగింది. నోట్ల మార్పిడికి నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత చాలామంది భక్తులు త‌మ వ‌ద్ద ఉన్న రూ. 2 నోట్ల‌ను ఆలయ పవిత్ర హుండీలో వేశారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ సమర్పణల ప్రాముఖ్యతను గుర్తించిన టిటిడి, రద్దు చేసిన నోట్ల మార్పిడిని సులభతరం చేయాలని కోరుతూ ఆర్‌బిఐ అధికారులను సంప్రదించింది. అంతేకాకుండా లేఖ కూడా రాసింది. టిటిడి అభ్యర్థనకు అనుకూలంగా స్పందించిన ఆర్‌బిఐ ప్రతినిధులు ఆలయ అధికారులతో కలిసి సజావుగా మార్పిడి ప్రక్రియ జరిగేలా కృషి చేశారు. ఐదు దశల్లో భక్తులు హుండీలో వేసిన రూ.3.2 కోట్ల విలువైన రూ.2000 నోట్లను టీటీడీ మార్చుకుంది. TTD.. తిరుమల ఆలయంలోని స్వామి వారి ‘హుండీ’లో కానుకగా అక్టోబర్ 8, 2023 నుంచి రూ. 3.20 కోట్ల విలువైన రూ. 2,000 కరెన్సీ నోట్లను స్వీకరించింది.

Also Read: Srileela Special Song : శ్రీలీల స్పెషల్ సాంగ్.. ఏ సినిమా కోసమో తెలుసా..?

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

ఇక‌పోతే తిరుమ‌ల‌లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 61,492 మంది భక్తులు దర్శించుకోగా.. 27,660 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.2.72 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. స‌మ్మ‌ర్ హాలిడేస్ కావ‌టంతో రానున్న రోజుల్లో భ‌క్తుల తాకిడి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేర‌కు సౌక‌ర్యాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.