తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గోశాలలో గోవులు మృతి చెందినట్లు వైసీపీ చేస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. కొంతమంది దురుద్దేశపూరితంగా మరెక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను టిటిడి గోశాలకు సంబంధించి ఉన్నట్లు ప్రజల్లో వ్యాప్తి చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ విధమైన అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని టిటిడి పేర్కొంది.
Indian Robots : మయన్మార్‌లో భారత రోబోలు.. ఏం చేస్తున్నాయి ?
టిటిడి గోశాలలు ఎంతో మంది దాతల సహకారంతో శ్రద్ధగా నిర్వహించబడుతున్నాయని, అక్కడ ఉన్న గోవులకు అత్యుత్తమ సంరక్షణ కల్పించబడుతోందని టిటిడి అధికార ప్రతినిధి తెలిపారు. ఈ గోశాలలలో గోవుల మృతిని చూపిస్తూ ప్రచారంలో వచ్చిన ఫోటోలు టిటిడి గోశాలకు సంబంధం లేనివని అధికారికంగా వెల్లడించారు. అవి పూర్తిగా వేరే ప్రాంతాలకు చెందినవని, వాటిని తప్పుదోవ పట్టించేలా ఉపయోగించడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ అంశంపై స్పందించిన టిటిడి ప్రజాసంబంధాల విభాగం, భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేసింది. ఈ దుష్ప్రచారంపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలియజేసింది. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూడటం దురదృష్టకరమని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని కోరింది.