Site icon HashtagU Telugu

Tirumala Laddu : లడ్డులో ‘గుట్కా ప్యాకెట్ ‘ ప్రచారాన్ని ఖండించిన టీటీడీ

Gutka Packet In Tirupati La

Gutka Packet In Tirupati La

Tirumala Laddu Another Controversy : ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారుచేశారనే వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా వివాదంగా మారిన సంగతి తెలిసిందే . దీనిపై యావత్ హిందువులు , రాజకీయ నేతలు , ఇలా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగానే మరో వివాదం వెలుగులోకి వచ్చింది. తిరుమల లడ్డు ప్రసాదంలో ‘గుట్కా ప్యాకెట్’ కనిపించడం భక్తులను మరింత షాక్ గురి చేస్తుంది. ఇప్పటికే తిరుమల లడ్డూలో పందికొవ్వు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వినియోగించారని రిపోర్టులలో తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్న వేళ…ఇప్పుడు ఏకంగా గుట్కా పాకెట్ బయటపడడం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రచారాన్ని టీటీడీ ఖండించింది.

తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదంది. ‘పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం’ అని ప్రకటన విడుదల చేసింది. ఖమ్మంలోని గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటోన్న దొంతు పద్మావతి అనే మహిళ.. సెప్టెంబర్ 19వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వచ్చింది. వచ్చేటప్పుడు బంధువుల కోసం, ఇంటిపక్కల ఉన్న వారికి ప్రసాదం ఇవ్వడానికి లడ్డులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో.. .ఆదివారం (సెప్టెంబర్ 22న) రోజున లడ్డూ ప్రసాదాన్ని పంచేందుకు బయటకు తీసింది. లడ్డులో గుట్కా ప్కాకెట్ (Gutka Packet) కనిపించేసరికి షాక్ కు గురైనట్లు తెలిపింది. అత్యంత పవిత్రంగా భావించే లడ్డులో.. జీడిపప్పు, కిస్మిస్ , యాలకులు ఉంటాయని అనుకున్న మహిళ.. గుట్కాప్యాకెట్ ఉండటం చూసి నివ్వేరపోయింది. గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించడంతో ఆమెతో పాటు ఇరుగుపొరుగు వారు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ దారుణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Read Also : KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు