Site icon HashtagU Telugu

BR Naidu Warning : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ హెచ్చరిక

TTD Chairman BR Naidu

TTD Chairman BR Naidu

తిరుమల శ్రీవారి దర్శనం (Tirumala), ఆర్జిత సేవా టికెట్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల నుండి భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) హెచ్చరించారు. కొందరు కేటుగాళ్లు తన ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకొని, భక్తులను మోసగిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐ భక్తులను లక్ష్యంగా చేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

Delhi Politics : ఢిల్లీ సీఎం ప్రకటనపై బిగ్‌ ట్విస్ట్‌..

ఈ మోసాలకు గురైన కొంత మంది భక్తులు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకురాగా, అతడి నంబర్ ఆధారంగా ట్రేస్ చేయగా, హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్ అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఈ మోసగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ & పోలీసు అధికారులను టీటీడీ ఛైర్మన్ ఆదేశించారు. భక్తులు కూడా ఈ విధమైన మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇక టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. హోంమంత్రి ఉపమాకలోని వేంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి సహాయపడాలని కోరారు. 2017లో టీటీడీ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ, గత ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. ఈ ఆలయాన్ని పూర్వ వైభవానికి తెచ్చేందుకు నిధులు విడుదల చేస్తామని టీటీడీ ఛైర్మన్ హామీ ఇచ్చారు.