Site icon HashtagU Telugu

TTD : తిరుమల ఆలయంపై నో-ఫ్లై జోన్ ప్రకటించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి

Ttd Chairman Br Naidu Appea

Ttd Chairman Br Naidu Appea

No-Fly Zone Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (Tirumala Temple) హిందువుల పవిత్ర క్షేత్రంగా వేలాది సంవత్సరాలుగా భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. రోజూ లక్షలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తుండటంతో ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం అవసరం. అయితే, ఇటీవలి కాలంలో హెలికాప్టర్లు, ప్రైవేట్ విమానాలు, డ్రోన్లు తిరుమలపైకి ప్రయాణించడం ఆలయ పవిత్రతకు భంగం కలిగించే పరిస్థితిని తీసుకొస్తోంది. ఆలయ ఆగమ శాస్త్రాల ప్రకారం గగనతల రాకపోకలు (No-Fly ) పూర్తిగా నిషేధించాలి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ తిరుమలపై నో-ఫ్లై జోన్ (No-Fly Zone) ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

Porn Sites Vs Bank Accounts: అశ్లీల సైట్ల పేరుతో స్కామ్.. బ్యాంకు అకౌంట్లు గుల్ల

తిరుమల ఆలయ పరిసరాల్లో గగనతల నియంత్రణ లేకపోవడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్లు చాలా తక్కువ ఎత్తులో తిరగడం భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఓ యూట్యూబర్ అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించి ఆలయ ప్రాంగణాన్ని చిత్రీకరించడంతో వివాదం ఏర్పడింది. భక్తుల భద్రత పరంగా కూడా ఇది ప్రమాదకరం. ఇప్పటికే వైష్ణో దేవి, గోల్డెన్ టెంపుల్, పూరీ జగన్నాథ ఆలయం, శబరిమల వంటి ప్రముఖ ఆలయాలపై నో-ఫ్లై జోన్ అమలులో ఉంది. ఇదే విధంగా తిరుమలకు కూడా ఇదే రీతిలో గగనతల పరిరక్షణ కల్పించాలని కోరారు.

Producer Kedar : కేదార్ మృతి పై పెరుగుతున్న అనుమానాలు

నో-ఫ్లై జోన్ విధించడం వల్ల భక్తులు మరింత ఆధ్యాత్మిక భావనతో స్వామివారిని దర్శించుకునే అవకాశముంటుంది. అలాగే భద్రతా పరంగా ఏవైనా ప్రమాదాలు జరగకుండా ముందుగానే నివారించవచ్చు. గతంలో ఇతర ఆలయాల్లో చోటుచేసుకున్న అనేక ఘటనలను దృష్టిలో ఉంచుకుని, తిరుమల ఆలయంపై గగనతల రాకపోకలను పూర్తిగా నిషేధించాలని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల ప్రశాంతత, ఆలయ పవిత్రత, భద్రత దృష్ట్యా తిరుమలపై నో-ఫ్లై జోన్ అనివార్యమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని భక్తులు సైతం కోరుతున్నారు.