సాధారణంగా చాలామంది అనుకున్న పనులు జరగలేదు అని దిగులు చెందుతూ బాధపడుతూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రంలో అనేక రకాల పరిష్కారాలు చెప్పబడ్డాయి. అందులో కొన్నింటిని ఉపయోగించి మనం మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అందులో ఎర్ర మిరపకాయ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మరి ఎర్ర మిరపకాయతో ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల మనం అనుకున్న పనుల్లో మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఉద్యోగ విషయంలో, అనుకున్న పనులు నెరవేరే విషయంలో ఎదురయ్యే సమస్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నిరాశకు గురవుతూ ఉంటారు.
అందుకు గ్రహాల దోషాల కారణం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. అటువంటి అప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల వాటిని నుంచి విముక్తి పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు మీరు ఇంటి నుంచి వెళ్తున్నట్టయితే ఇంటి నుంచి బయలుదేరేముందు ఐదు ఎండు మిరపకాయలను తీసుకొని వాటిని గుమ్మంలో ఉంచండి. అలాగే ఎప్పుడైనా ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆ మిరపకాయలపై మీ పాదాలను ఉంచి బయటకు వెళ్లడం ద్వారా అనుకున్న పనులు సక్రమంగా జరగడంతో పాటు అంతా మంచే జరుగుతుంది.
అలాగే కొంతమందికి అనుకున్న పనులు కొంత కాలం పాటు జరుగుతూనే ఉంటాయి. ఆ పనులు నిలిచిపోయి జరగక ఇబ్బందులు పడేవారు ఈ పని చేయడం వల్ల వెంటనే విజయం సాధించవచ్చు. అటువంటప్పుడు 21 మిరపకాయలను తీసుకొని వాటిని నీటితో నింపాలి. ఆ నీటిని ఏడుసార్లు దిష్టి మాదిరి పైనుంచి కిందికి తీసి వెంటనే వాటిని రోడ్డుపై పడేయాలి. అలాగే మన ఇంట్లో పిల్లలకు చెడ్డదృష్టి అనగా దృష్టి తగిలినప్పుడు ఏడు ఎండు మిరపకాయలను తీసుకొని పిల్లల చుట్టూ ఏడుసార్లు రివర్స్లో తిప్పండి. ఆ మిరపకాయలను తీసుకెళ్లి మంటలు వేస్తే సరిపోతుంది. దీనినే దిష్టి తీయడం అని కూడా అంటారు. అలాగే ఎంత కష్టపడి అంకితభావంతో పనిచేసినప్పటికీ మీ ఇంటికి అదృష్టం రాకపోతే 7 ఎర్ర మిరపకాయలను రుమాలులో కట్టి, మీ డబ్బును ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తిరిగి వస్తుంది.