Astrology 2026 : జనవరి 1న మీ రాశి ప్రకారం ఇలా ట్రై చేయండి.. కొత్త సంవత్సరం ఫలితాలు అదిరిపోతాయ్‌!

Astrology 2026 : గడుస్తున్న 2025కి వీడ్కోలి పలికి.. నూతన సంవత్సరం 2026కి స్వాగతం పలకడానికి యావత్తు భారతదేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎవరి ప్రణాళికలు వాళ్లు వేసుకుంటున్నారు. చిన్న పల్లెటూరు నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు New Year 2026 Celebrations హోరెత్తనున్నాయి. ఈక్రమంలో జనవరి 1వ తేదీన సెలబ్రేషన్స్‌ మాత్రమే కాకుండా ఆయా రాశుల వాళ్లు వారి వారి రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటిస్తే.. కొత్త ఏడాది సరికొత్త ఉషస్సులా ఉంటుందో చూద్దాం.. […]

Published By: HashtagU Telugu Desk
Zodiac

Zodiac

Astrology 2026 : గడుస్తున్న 2025కి వీడ్కోలి పలికి.. నూతన సంవత్సరం 2026కి స్వాగతం పలకడానికి యావత్తు భారతదేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎవరి ప్రణాళికలు వాళ్లు వేసుకుంటున్నారు. చిన్న పల్లెటూరు నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు New Year 2026 Celebrations హోరెత్తనున్నాయి. ఈక్రమంలో జనవరి 1వ తేదీన సెలబ్రేషన్స్‌ మాత్రమే కాకుండా ఆయా రాశుల వాళ్లు వారి వారి రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటిస్తే.. కొత్త ఏడాది సరికొత్త ఉషస్సులా ఉంటుందో చూద్దాం..

ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. ప్రపంచవ్యాప్తంగా జనవరి 1వ తేదీన నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు జరుపుకుంటారు. ఈరోజున ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో తమకు అంతా బాగా జరగాలని.. ఎలాంటి ఆటంకాలు కలుగకూడదని కోరుకుంటారు. గత సంవత్సరం ఎదురైన చెడు అనుభవాలు ఈ ఏడాది ఎదురుకాకుండా ఉండాలని.. అంతా మంచే జరగాలని కోరుకుంటారు. అయితే మరికొద్ది రోజుల్లో 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి.. 2026 నూతన సంవత్సరం (New Year 2026)లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో రాబోయే కొత్త ఏడాది ఎలాంటి ఆటంకాలు, సవాళ్లు ఎదురుకాకుండా.. ఆయా రాశి ప్రకారం పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి

Aries

ఈ మేష రాశి అధిపతి కుజుడు. కొత్త ఏడాది 2026 జనవరి 1వ తేదీన ఈ మేష రాశి వాళ్లు ఎర్రటి పూలతో ఆంజనేయస్వామిని పూజించడం మంచిది. అలాగే హనుమాన్‌ చాలీసా పఠించడం శుభప్రదం.

వృషభ రాశి

Taurus

ఈ రాశికి శుక్రుడు అధిపతి. నూతన సంవత్సరం 2026 జనవరి 1వ తేదీన ఈ వృషభ రాశి వాళ్లు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అలాగే తెల్లటి వస్తువలు దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

మిథున రాశి

Gemini

ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వాళ్లు కొత్త సంవత్సరం 2026 జనవరి 1వ తేదీన శ్రీమహావిష్ణువును పూజించడం అత్యంత విశిష్టమైనది. అలాగే పేద పిల్లలకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం మంచిది.

కర్కాటక రాశి

Cancer

ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వాళ్లు కొత్త సంవత్సరం 2026 జనవరి 1వ తేదీన శివుడిని పూజించడం, పాలతో అభిషేకం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

సింహ రాశి

Leo

ఈ సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహ రాశి వాళ్లు కొత్త సంవత్సరం 2026 జనవరి 1వ తేదీన సూర్యుడికి పూజ చేయడం, ఆర్ఘ్యం సమర్పించడం, దానధర్మాలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

కన్య రాశి

Virgo

ఈ కన్య రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశి వాళ్లు నూతన సంవత్సరం 2026 జనవరి 1వ తేదీన వినాయకుడిని పూజించడం అత్యంత విశిష్టమైనది. అలాగే ఈ రాశి వాళ్లు కొత్త ఏడాది వేళ పచ్చని వస్తువులు, కూరగాయలు వంటివి దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

తుల రాశి

Libra

ఈ తుల రాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ తుల రాశి వాళ్లు నూతన సంవత్సరం 2026 జనవరి 1వ తేదీన లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభప్రదం. అలాగే ఈ రాశి వాళ్లు ఆరోజున తెల్లటి వస్త్రాలు దానం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

Scorpio

ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వాళ్లు న్యూ ఇయర్‌ 2026 జనవరి 1వ తేదీన హనుమంతుడిని పూజించాలి. అలాగే ఈ రోజున ఎర్రటి పప్పు, ఎర్రటి వస్తువలు దానం చేయడం శుభప్రదంగా చెప్పొచ్చు.

ధనుస్సు రాశి

Sagittarius

ఈ ధనుస్సు రాశి వారికి అధిపతి గురువు (బృహస్పతి). ఈ ధనుస్సు రాశి వాళ్లు ఈ రాశి వాళ్లు కొత్త ఏడాది 2026 జనవరి 1వ తేదీన గురువును, శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

Capricorn

ఈ మకర రాశి వారికి అధిపతి శని. ఈ మకర రాశి వాళ్లు న్యూ ఇయర్‌ 2026 జనవరి 1వ తేదీన శని దేవుడిని పూజించాలి. అలాగే నల్ల నువ్వులు, బెల్లం దానం చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

Aquarius

ఈ కుంభ రాశి వారికి కూడా అధిపతి శని. ఈ కుంభ రాశి వాళ్లు కూడా కొత్త సంవత్సరం 2026 జనవరి 1వ తేదీన శని దేవుడిని పూజించాలి. అలాగే బెల్లం, నల్ల నువ్వులు దానం చేయాలి. వీలైతే పేద వాళ్లకు సాయం చేయాలి.

మీన రాశి

Pisces

ఈ మీన రాశి వాళ్లకి అధిపతి బృహస్పతి (గురువు). ఈ మీన రాశి వాళ్లు న్యూ ఇయర్‌ 2026 జనవరి 1వ తేదీన శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పసుపు లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయడం శుభప్రదం.

 

  Last Updated: 08 Dec 2025, 01:07 PM IST